ఎన్టీఆర్ వైఫ్ పాత్రలో .. విద్యాబాలన్ ?

Monday, March 12th, 2018, 11:10:14 AM IST

దివంగత మాజీ ముఖ్యమంత్రి, మహా నటుడు అన్న నందమూరి తారకరామారావు జీవిత కథతో సినిమా తెరకెక్కించేందుకు రంగం సిద్దమైనది. అయన తనయుడు నందమూరి బాలకృష్ణ హీరోగా తేజ దర్శకత్వంలో తెరకెక్కే ఈ చిత్రం ఈ నెల 29న లాంఛనంగా ప్రారంభం కానుంది. ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో తీయాలని ప్లాన్ చేస్తున్నారు. ఒక్క తెలుగులోనే కాకుండా, హిందీ , తమిళ భాషల్లో రూపొందించాలని సన్నాహాలు చేస్తున్నారట. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ భార్య పాత్ర కోసం ఎవరిని తీసుకోవాలని పలువురు హీరోయిన్స్ ని పరిశీలించారట. అయితే అందులో విద్య బాలన్ అయితే బాగుంటుందని అలోచించి ఆమెను సంప్రదించే ప్రయత్నాల్లో ఉన్నారట. విద్య బాలన్ అయితే అటు హిందీ, తమిళ భాషల్లో కూడా ఆమెకు మంచి క్రేజ్ ఉంది. అందుకే ఆమె అయితే బెటర్ అనే ఆలోచనలో ఈ ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఈ విషయం గురించి విద్య బాలన్ ఎలా స్పందిస్తుందో చూడాలి.