రాజమౌళి పై ఫోకస్ పెట్టిన… డర్టీ హీరోయిన్ ?

Thursday, November 24th, 2016, 01:59:09 AM IST

vidya-balan
”బాహుబలి” సినిమాతో ఒక్కసారిగా ఖ్యాతి పొందాడు రాజమౌళి. ‘బాహుబలి’ సినిమా భారీ వసూళ్లు సాధించి సంచలనం రేపింది. ఇక అయన ప్రస్తుతం ‘బాహుబలి 2’ సినిమా చేస్తున్నాడు, ఈ మధ్య ప్రతి హీరో, హీరోయిన్ అది టాలీవుడ్ లో అయినా , లేదా బాలీవుడ్, కోలీవుడ్ అయినా రాజమౌళి తో సినిమా చేయాలనీ తెగ ఆరాటపడుతున్నారు. రాజమౌళి సినిమాలో ఒక్క ఛాన్స్ వస్తే చాలు? అంటూ కలవరిస్తున్నారు కూడా. ఇక తనకు కూడా రాజమౌళి సినిమాలో నటించాలని ఉందనే కోరికను బయటపెట్టింది బాలీవుడ్ హాట్ భామ విద్యాబాలన్ !! ”డర్టీ పిక్చర్” సినిమాతో సంచలనం రేపిన ఈమె ప్రస్తుతం ”కహాని 2” లో నటిస్తుంది. ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా వచ్చే నెలలో విడుదల కానుంది. ఇక రాజమౌళి సినిమాలో నటించాలని ఉందంటూనే .. సరైన స్క్రిప్ట్ వస్తే తెలుగులోనూ నటిస్తా అంటూ కామెంట్ చేసింది హాట్ హాట్ అందాల విద్యా బాలన్!!