పెళ్లి గురించి స్పందించిన నయనతార బాయ్ ఫ్రెండ్ ?

Thursday, September 20th, 2018, 10:51:09 AM IST

సౌత్ గ్లామర్ స్టార్ నయనతార ఓ వైపు వరుసగా సినిమాలు చేస్తూనే మరోవైపు పర్సనల్ లైఫ్ ని బాగా ఎంజాయ్ చేస్తుంది. దర్శకుడు విగ్నేష్ శివన్ తో గత కొంత కాలంగా ప్రేమాయణం సాగిస్తున్న ఈ అమ్మడు ఈ మద్యే లవర్ తో కలిసి తీర్థయాత్రలకు వెళ్ళింది. అమృత్ సర్ లోని స్వర్ణ దేవాలయానికి వెళ్లి అక్కడ ప్రత్యేక పూజలు చేయించింది. ఈ ఫొటోలను సోసిల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వీరిద్దరి ప్రేమకథ గురించి కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. తాజాగా వీరి పెళ్లి విషయం పై విగ్నేష్ శివన్ ను ఓ ఇంటర్వ్యూ లో అడిగితె .. తన పెళ్లి గురించి తనకు తెలియదని, ఈ విషయాన్నీ నయనతారను అడిగి చెబుతానని అన్నాడు. సో పెళ్లి విషయంలో వీరిద్దరి ఇంకా క్లారిటీ లేనట్టుంది.