కాశీ సినిమాపై విజయ్ సంచలన నిర్ణయం… ఇంతకీ సినిమా విడుదల అవుతుందా..?

Tuesday, May 15th, 2018, 04:49:49 PM IST

బిచ్చగాడు చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన ప్రముఖ సంగీత దర్శకుడు, నటుడు విజయ్ అంటోనీ. అతని సినిమా వస్తుందంటే సినీ అభిమానుల్లో కూడా ఏదో ఉత్ఖంటత మొదలవుతుంది. అయితే తాజా ఉదయనిధి దర్శకత్వంలో, విజయ్ హీరోగా నటించిన సినిమా కాశీ, తమిళంలో కాళీ అంజలీ కథానాయికగా, లెజెండ్ సినిమా పతాకంపై ఫాతిమా, విజయ్ ఆంటోనీ ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఆయనే సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్న ఈ సినిమా మే నెల 18 విడుదలకు అన్ని విధాలా సిద్దం కాగా ఈ సినిమాకు ఓ పెద్ద దెబ్బ ఎదురయింది. హృదయాన్ని కలవరపరచే, భావోద్వేగాలకు, లాజికల్ అండ్ థ్రిల్లింగ్ సీన్లకు ప్రాధాన్యతనిస్తూ తీసిన ఈ సినిమాలో కొన్ని సీన్లు లీకయినట్లు సమాచారం అందింది.

ఏంతో కష్టపడి కొన్ని నెలలు నిద్రాహారాలు మానుకొని తీసిన సినిమాలో ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు అటు దర్శక నిర్మాతలు, ఇటు నటీ నటులు, ఎంతగానో బాధ పడాల్సి వస్తుంది. ఇలాంటి సమయంలోనే ఓ కీలక నిర్ణయ తీస్కోవడం మంచిదనుకున్నాడు విజయ్. సినీ చరిత్రలోనే ఓ గొప్ప చరిత్ర సృస్టించబోతున్నాడు. ఈ సినిమాలోని మొదటి 7 నిమిషాల నిడివి గల సీన్లను సోషల్ మీడియాలో అధికారికంగా విడుదల చేయడానికి సిద్దపడ్డాడు. 7 నిమిషాల స్టొరీని సినిమా విడుదలకు ముందే రిలీజ్ చేయడం అంటే నిజంగా ఆషామాషీ కాదండోయ్. ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఏ సినిమానైనా ఫస్ట్ లుక్ లు, టీజర్లు, ట్రైలర్లు, పాతము మహా అయితే మోషన్ పోస్టర్లు విడుదల చేశారు. కానీ ఇలా సినీ చరిత్రలో 7 నిమిషాల సినిమాను విడుదలకు ముందే బయటికి రిలీజ్ చేయడం నిజంగానే ఒక సంచలన నిర్ణయం అని చెప్పుకోవాలి.

  •  
  •  
  •  
  •  

Comments