అందుకే మహానటి లో నటించా : విజయ్ దేవరకొండ

Wednesday, May 9th, 2018, 09:01:36 AM IST

అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్కసారిగా తన కెరీర్ ను మార్చేసుకున్న విజయ్ దేవరకొండ డిఫెరెంట్ సినిమాల్లో నటించడానికి రెడీ అవుతున్నాడు. మంచి పాత్రలు వస్తే సినిమా ఎలాంటిదైనా చేయడంలో ఈ హీరో ముందుంటాడని సావిత్రి బయోపిక్ ద్వారా చెప్పకనే చెప్పాడు. భారీ అంచనాల నడుమ ఈ రోజు ఆ సినిమా విడుదల కానుంది. ఈ సంధర్బంగా ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయ్ సినిమాకు సంబందించిన విషయాల్ని అభిమానులతో పంచుకున్నాడు.

ముఖ్యంగా సావిత్రి బయోపిక్ లో అవకాశం రాగానే సావిత్రి పాత్ర అయినా చేస్తాను అని చెప్పను. దీంతో నిర్మాత స్వప్నదత్ గట్టిగా నవ్వేసి ఒక చిన్న పాత్ర చేయాలనీ చెప్పడంతో వెంటనే ఒప్పేసుకున్న. ఎందుకంటే మహానటి టీమ్ తో నాకు దగ్గరి సాన్నిహిత్యం ఉంది. ఎందుకంటే ఎవడే సుబ్రమణ్యం సినిమా వారితో కలిసి చేశాను. దర్శకుడు నాగ్ అశ్విన్ నాపై వ్యక్తిగతంగా ప్రభావం చూపిన వ్యక్తి. దీంతో చిన్న పాత్ర అయినా నో చెప్పలేదు. ఈ సినిమాలో సమంతతో కలిసి నటిస్తానని ఊహించలేదు. నటనలో సీనియర్ అయినప్పటికీ సెట్ లో ఆ విధంగా ఎప్పుడు ప్రవర్తించలేదు. సావిత్రి గురించి పరిశోధన చేసే సమంతకు సాయం చేసే పాత్ర తనది అంటూ విజయ్ వివరించాడు.