విజయ్ సోదరుడికి దొరసాని నచ్చిందట?

Thursday, July 26th, 2018, 10:57:51 AM IST

అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్కసారిగా పెద్ద దుమారమే రేపాడు హీరో విజయ్ దేవరకొండ. ఆ ఒక్క సినిమాతో క్రేజీ హీరోగా మారిపోయిన విజయ్ దేవరకొండ కు అవకాశాలు క్యూ కట్టాయి. ప్రస్తుతం గీతా గోవిందం, టాక్సీవాలా సినిమాల్లో నటిస్తున్న అయన సోదరుడిని హీరోగా పరిచయం చేసే ప్రయత్నాలు చేస్తున్నాడు. అయన తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. సురేష్ బాబు, మధుర శ్రీధర్ సంయుక్తంగా ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో ఆనంద్ ఎంట్రీ ఇస్తాడట. మహేంద్ర అనే యువ దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో సినిమాకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ చిత్రానికి దొరసాని అనే టైటిల్ ఖరారు చేసాడు. త్వరలోనే దీనికి సంబందించిన వివరాలు వెల్లడికానున్నాయి.

  •  
  •  
  •  
  •  

Comments