మంత్రి కేటీఆర్‌ని ఇమ్మిటేట్ చేశా – సీఎం దేవ‌ర‌కొండ‌

Thursday, October 4th, 2018, 11:49:06 PM IST


విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన నోటా రిలీజ్ కి ముందే ప‌లు వివాదాల్లో చిక్కుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాని ఒక పార్టీకి అనుకూలంగా తీశార‌ని, నోటాని రిలీజ్ చేయ‌నివ్వ‌మ‌ని కాంగ్రెస్ నాయ‌కులు స‌హా తేరాస వ్య‌తిరేక పార్టీల‌న్నీ రుబాబ్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే దేవర‌కొండ మాత్రం సినిమ‌లో అలాంటిదేమీ ఉండ‌ద‌ని, రాజ‌కీయాల నేప‌థ్య ంలో తీసిన చిత్ర‌మిద‌ని తెలిపారు. ఈ సినిమా ఎలాంటి అవాంత‌రాలు లేకుండా ఈనెల 5న రిలీజ‌వుతోంద‌ని వెల్ల‌డించారు. కోర్టు వివాదాలు ప‌రిష్కారం అయ్యాయా? అంటే అవున‌ని అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఒక‌రోజు ముందు సెన్సార్ పూర్త‌య్యింద‌ని యుఏ స‌ర్టిఫికెట్ ఇచ్చార‌ని తెలిపారు. అయితే త‌మిళంలో మాత్రం యు స‌ర్టిఫికెట్ ఇవ్వ‌డం చూశాక కొంత నా బ్రాండ్ మిస్స‌యిందని ఫీల‌య్యాన‌ని వెల్ల‌డించారు.

నోటాలో ఇదివ‌ర‌కెన్న‌డూ చూడ‌ని యంగెస్ట్ సీఎంని చూస్తార‌ని దేవ‌ర‌కొండ ఘంటాప‌థంగా చెబుతున్నారు. ఇంత‌వ‌ర‌కూ చూసి ఉండ‌ని సీఎంని చూస్తార‌ని ఓ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించారు. ఈ సినిమాలో రాజ‌కీయ నేప‌థ్య ం ఉన్నా పూర్తిగా రాజ‌కీయాలు, అవినీతి మాత్ర‌మే కాకుండా .. అన్ని అంశాలు ఉంటాయ‌ని తెలిపారు. ముఖ్య మంత్రిగా న‌టిస్తున్నారు క‌దా? ఏ రాజ‌కీయ నాయ‌కుడిని స్ఫూర్తిగా తీసుకున్నారు? ఎవ‌రి గెట‌ప్‌ని అయినా అనుస‌రించారా? అన్న ప్ర‌శ్న‌కు .. స్టైలింగ్ స‌హా ఆహార్య ం విష‌యంలో యంగ్ మినిస్ట‌ర్, తేరాస నాయ‌కుడు కేటీఆర్ ని అనుస‌రించాన‌ని తెలిపారు. ఆయ‌న తీరుగా క‌నిపించే ఫోటోల్ని తొంద‌ర్లోనే రివీల్ చేస్తాన‌ని తెలిపారు.ఇక ఖాదీ వ‌స్త్రధార‌ణ విష‌యంలోనూ కేటీఆర్‌నే స్ఫూర్తిగా తీసుకున్నాన‌ని తెలిపారు. మొత్తానికి దేవ‌ర‌కొండ స‌పోర్టు తేరాస‌కేన‌ని అర్థ‌మ‌వుతోంది.