`మ‌హాన‌టి`పై అర్జున్‌రెడ్డి ఎమోష‌న్‌

Tuesday, April 24th, 2018, 09:54:25 PM IST

సావిత్రి ఆల్క‌హాల్ సేవించి నాశ‌నం అయ్యార‌ని, భ‌ర్త వ‌దిలేసిన మ‌గువ అని .. జ‌నం ర‌క‌ర‌కాలుగా మాట్లాడుకున్నారు. అంత గొప్ప మ‌హాన‌టి చివ‌రి రోజుల్లో దుర్భ‌ర‌మైన జీవితం గ‌డ‌ప‌డానికి కార‌ణం దుర‌ల‌వాట్లేన‌ని ప్ర‌చారం చేశారు. అయితే ఆ దుర‌ల‌వాట్ల వెన‌క క‌ఠోర స‌త్యాల్ని కానీ, లేదూ త‌న లైఫ్‌లో ఉన్న గొప్ప ల‌క్ష‌ణాల్ని కానీ ఎవ‌రూ ఏనాడూ ప్ర‌స్థావించ‌లేదు. ఇదే విష‌యాన్ని అర్జున్‌రెడ్డి ఫేం, యంగ్ అండ్ డైన‌మిక్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ సూటిగా ప్ర‌శ్నించాడు. అలాంటి మ‌హానటిని, మ‌హాసాధ్విని, దాన‌గుణం ఉన్న మంచి మ‌నిషిని జ‌నం అలా ఆడిపోసుకున్నందుకు త‌న‌దైన శైలిలో తిట్టి పోశాడు దేవ‌రకొండ‌.

“మ‌హాన‌టిని తిట్టిన‌వాళ్లంతా సారీ చెప్పాల‌నుకుంటే చెన్న‌య్ లీలా ప్యాలెస్‌లో ఉన్నా .. అక్క‌డికి రండి.. వచ్చిన వారికి `మ‌హాన‌టి` ఆడియో లాంచ్ ఎంట్రీ ఇస్తామ‌ని అన్నాడు. క్ష‌మాప‌ణ‌లు చెబితే సావిత్రి ఆత్మ శాంతిస్తుంది. సాంప్ర‌దాయం, విలువ‌లు అంటూ సావిత్రిని నానా ర‌కాల మాట‌ల‌న్నారు..ప‌శ్చాత్తాపం ప్ర‌క‌టించుకోండి“ అని అన్నాడు. సావిత్రి మ‌హాసాధ్వి. గొప్ప న‌టి. అంత‌కుమించి దాన‌గుణం, విన‌య‌విధేయ‌త‌లు, సంస్కారం ఉన్న సూప‌ర్‌స్టార్‌.. అని త‌న‌లోని గొప్ప విష‌యాల్ని బ‌య‌టి ప్ర‌పంచానికి తెలిపాడు దేవ‌ర‌కొండ‌. మొత్తానికి అత‌డు చెప్పిన‌దానిని బ‌ట్టి మ‌హాన‌టి త‌మిళ ఆడియో లాంచ్ ఘ‌నంగా జ‌ర‌గ‌నుంద‌ని అర్థ‌మైంది. మే 9న ఈ సినిమా తెలుగు, త‌మిళ్‌లో అత్యంత ఘ‌నంగా రిలీజ్ కానున్న సంగ‌తి తెలిసిందే.

  •  
  •  
  •  
  •  

Comments