ముఖ్యమంత్రిగా అర్జున్ రెడ్డి కనిపిస్తే?

Wednesday, July 11th, 2018, 05:17:50 PM IST

అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్కసారిగా తెలుగు ప్రేక్షకులను తనవైపుకు తిప్పుకున్న విజయ్ దేవరకొందా ఆ రేంజ్ లో మళ్ళి తన ప్రతాపాన్ని చూపాలని అనుకుంటున్నాడు. నెక్స్ట్ వరుసగా రెండు సినిమాలతో ఎక్కువగా గ్యాప్ ఇవ్వకుండా బాక్స్ ఆఫీస్ హిట్ అందుకోవాలని చూస్తున్నాడు. ఇప్పటికే టాక్సీ వాలా సినిమా పూర్తయ్యింది. మరికొన్ని రోజుల్లో రిలీజ్ కానుంది. ఇక మరో డిఫెరెంట్ సినిమా గీత గోవిందం కూడా రెడీ అవుతోంది.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇకపోతే తమిళ్ – తెలుగులో చేస్తున్న నోటా అనే సినిమాలో విజయ్ సిఎం పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. రాజకీయ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఆ సినిమాకు ఆనంద్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటివరకు విజయ్ చేసిన సినిమాలు చాలా డిఫెరెంట్ గా వచ్చినవే. ఇక ఇప్పుడు ఒక పొలిటీషియన్ గా ముఖ్యమంత్రి పాత్రలో కనిపించి మరింత డిఫెరెంట్ గా తెరపై ఆకట్టుకోవాలని ఈ హీరో అనుకుంటున్నాడు. మరి ఆ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments