లేడి దర్శకురాలితో విజయ్ దేవరకొండ సినిమా ?

Monday, December 4th, 2017, 12:20:42 PM IST

సినిమా రంగంలో లేడి దర్శకుల సంఖ్య ఎప్పుడు తక్కువే. ఆ ఉన్న వాళ్లలో కూడా కమర్షియల్ విజయాలు అందుకునే వారు ఇంకా అరుదు. ఇక టాలీవుడ్ లో లేడి దర్శకురాలిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నందిని రెడ్డి .. అలా మొదలైంది సినిమా తో క్రేజ్ తెచ్చుకుంది .. కానీ ఆ సినిమా తరువాత ఆమె తీసిన సినిమాలన్నీ పరాజయాలను చవిచూశాయి. అయినా తన ప్రయత్నాలు తాను చేస్తూనే ఉంది. తాజాగా విజయ్ దేవరకొండలో ఓ సినిమా ప్లాన్ చేసింది .. అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్ కెరీర్ ఒక్కసారిగా టర్న్ కావడంతో .. కథ మార్చమని చెప్పాడట . .లేదంటే సినిమా చేయనని చెప్పడంతో .. వెంటనే ఆ పనిలో పడింది నందిని రెడ్డి .. ప్రస్తుతం స్క్రిప్ట్ ను మార్చే పనిలో ఉన్న ఆమె విజయ్ తో ఎలాగైనా సరే సినిమా చేయడానికి ఫిక్స్ అయిందట. నిజానికి ఇప్పటికే నాలుగు సినిమాలతో బిజీగా ఉన్న విజయ్ నందినితో సినిమా చేయడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదని వార్తలు వస్తున్నాయి. దానికి కారణం నందినికి సరైన సక్సెస్ లు లేవు.. దాంతో పాటు కథ కూడా నచ్చలేదని చెప్పాడట. కానీ నందిని రెడ్డి తో కచ్చితంగా సినిమా చేయాలనీ ఒత్తిడి రావడంతో సరే అనేక తప్పలేదని తెలుస్తోంది ? ఇంతకీ విజయ్ ని అంత ఫోర్స్ చేస్తున్నది ఎవరని షాక్ అవుతున్నారా … ఇంకెవరు ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ కుమార్తె స్వప్న దత్? ఆ బ్యానర్ లో వచ్చిన ఎవడె సుబ్రహ్మణ్యం సినిమాతో కెరీర్ మొదలు పెట్టిన విజయ్ .. అలాగే స్వప్న దత్ తో మంచి స్నేహం ఉన్న నందిని రెడ్డి ఆమెతో విజయ్ ని ఒప్పించినట్టు వార్తలు వస్తున్నాయి .. !! చూద్దాం ఏమి జరుగుతుందో.

  •  
  •  
  •  
  •  

Comments