ప్రేమ పెళ్లే చేసుకుంటానంటున్న గోవిందం ?

Saturday, September 1st, 2018, 11:00:54 AM IST

లేటెస్ట్ గా గోవిందం గా ఫ్యామిలీ ఆడియెన్స్ కు బాగా కనెక్ట్ అయ్యాడు మన గోవిందం అలియాస్ విజయ్ దేవరకొండ. తాజాగా అయన నటించిన గీత గోవిందం సినిమా ఇటీవలే విడుదలై సూపర్ హిట్ టాక్ తో వందకోట్ల వసూళ్లను రాబట్టి .. వందకోట్ల హీరోగా మారిపోయాడు. ఇక అర్జున్ రెడ్డి సినిమాతో ఏకంగా యూత్ ఐ కాన్ గా మారిన విజయ్ దేవరకొండకు అటు అమ్మాయిల్లో అయితే ఓ రేంజ్ లో ఫాలోయింగ్ ఏర్పడింది. అయితే మనోడు .. ప్రేమించే పెళ్లి చేసుకుంటానని చెప్పేసాడు ? ఏంటి ఈ న్యూస్ తో అమ్మాయిలు ఖుషి అవుతున్నారా ? నిజమే తాజాగా ఓ ఇంటర్వ్యూ లో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ నేను ప్రేమించే పెళ్లి చేసుకుంటాను .. పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకోవడం నా వల్ల కాదు అంటూ .. నేను ప్రపంచంలో ఎక్కడి అమ్మాయిని అయినా పెళ్లి చేసుకుంటా , తెలంగాణ, ఆంధ్ర , అమెరికా అన్న తేడా లేదు . నాకు కనెక్ట్ కాగలిగే చాలు అంటూ హింట్ ఇచ్చేసాడు. అయితే ఇప్పటి వరకు తనకు అలాంటి అమ్మాయి తారసపడలేదట !!

  •  
  •  
  •  
  •  

Comments