ఎన్టీఆర్ పై విజయ్ సెన్సేషనల్ కామెంట్స్ ?

Wednesday, October 3rd, 2018, 10:30:19 PM IST


యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి హీరో విజయ్ దేవరకొండ సంచలన వ్యాఖ్యలు చేసాడు .. ? ఏంటి షాక్ అవుతున్నారా .. !! ఆ వ్యాఖ్యలు నెగిటివ్ గా కాదులెండి .. మంచివే !! తాజాగా ఎన్టీఆర్ నటించిన అరవింద సామెత వీర రాఘవ ఈ నెల 11 న విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను టార్గెట్ చేస్తూ విజయ్ దేవరకొండ నటిస్తున్న నోటా చిత్రాన్ని విడుదల చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో రచ్చ నడుస్తుంది. ఇక తన అభిమానులు వేరే హీరోల అభిమానులనుతో గొడవలు పడడం మంచిది కాదని హితవు పలికారు. అయితే మరికొందరు ఎన్టీఆర్ సినిమాకు పోటీగా విడుదల చేయొద్దంటూ సలహా ఇచ్చారట .. అయితే నా సినిమాను విడుదల చేసే విషయంలో ఎవరు సలహాలు ఇచ్చిన నాకు నచ్చదు. అయినా ఎన్టీఆర్ లాంటి పెద్ద స్టార్ తో నాకు పోటీ ఏమిటి. అయన సినిమా కూడా పెద్ద సినిమా. నాకు ఆ సినిమాతో ఎలాంటి పోటీ లేదు .. ఎన్టీఆర్ అన్న నా సినిమాలను మెచ్చుకుంటూ ఉంటాడు. అయన అంటే నాకు ఇష్టమే అంటూ కామెంట్ చేసాడు. అలాగే తనకు రౌడీ గ్యాంగ్ అంటూ ఓ పెద్ద ఫాలోయిన్ సర్కిల్ ఉన్న విషయం తెలిసిందే .. ఈ గ్యాంగ్ తో మొన్న ప్రతిజ్ఞ కూడా చేయించాడు విజయ్. అది సంగతి.