టాలీవుడ్ ట్రెండింగ్ న్యూస్.. రానాకి షాక్ ఇచ్చిన విజ‌య్..?

Thursday, October 18th, 2018, 12:41:10 AM IST

టాలీవుడ్ యంగ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ ఏ ప‌ని చేసినా, ఏం మాట్లాడినా సెన్షేష‌న్ అయిపోతుంది. అర్జున్ రెడ్డి చిత్రంతో యూత్‌లో అంత‌గా క‌నెక్ట్ అయిపోయాడు ఈ యంగ్ హీరో. ఇక అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే తాజ‌గా రానా నెంబ‌ర్ వ‌న్ యారీ సెకండ్ సీజ‌న్ స్టార్ట్ అయ్యింది. ఇక ఈ సీజ‌న్ తొలి ఎపిసోడ్‌లో మ‌హ‌న‌టి డైరెక్ట‌ర్ నాగ అశ్విన్, అర్జున్ రెడ్డితో రాత్రికి రాత్రే స్టార్‌డ‌మ్ సంపాదించిన విజ‌య్ దేవ‌ర‌కొండ వ‌చ్చారు. దీంతో ఈ ఇద్ద‌రి స్నేహితుల నుండి కొన్ని ఆశ‌క్తిక‌ర‌మైన సీక్రెట్స్ రాబ‌ట్టాడు రానా.

ఇక ఈ ప్రోగ్రాంలో ఒక సెగ్మెంట్‌లో భాగంగా రానా- విజ‌య్‌ నువ్వు ఫ‌స్ట్ కిస్ ఎప్పుడు పెట్టావ‌ని ప్ర‌శ్నించ‌గా.. నా తొలిముద్దు పెట్టుకోవ‌డానికి 19 ఏళ్ళు ప‌ట్టింద‌ని.. ఫ‌స్ట్ నుండి బాయ్స్ హాస్ట‌ల్‌లో చ‌దువుకోవ‌డం వ‌ల్ల అమ్మాయిలు అంటే చాలా భ‌య‌మ‌ని చెప్పాడు. ఇక నువ్వు వ‌ర్జిన్‌వా.. కాదా అని ప్ర‌శ్నించ‌గా.. నాగ అశ్విన్ కాద‌ని అనుమానంగా త‌ల ఊప‌గా.. వెంట‌నే విజయ్ అందుకొని అలా అంద‌రి ముందు నో అని చెప్ప‌కూడ‌ద‌ని షాక్ ఇచ్చాడు విజ‌య్. అయితే ఫైన‌ల్‌గా తాను ఇప్ప‌టికీ వ‌ర్జినే అని స్ప‌ష్టం చేశాడు విజ‌య్. ఇక ఈ ప్రోగ్రాంలో విజ‌య్ నుండి అనేక ఆశ‌క్తిక‌ర‌మైన విష‌యాలు రాబ‌ట్టాడు రానా.

  •  
  •  
  •  
  •  

Comments