నోటా విషయంలో టెన్షన్ మీదున్న విజయ్ ?

Sunday, September 30th, 2018, 06:20:04 PM IST

గీత గోవిందం సక్సెస్ తో మంచి జోరుమీదున్న విజయ్ దేవరకొండ తాజా చిత్రం నోటా. తెలుగు తమిళ భాషల్లో విడుదల అవుతున్న ఈ సినిమా పై పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ముక్యంగా ఈ సినిమా ఈ నెల 5న విడుదల అవుతున్నా కూడా పబ్లిసిటీ పరంగా ఎక్కడ హంగామా కనిపించడం లేదు. ఈ సినిమా విషయంలో ఒక్క విజయ్ పేరే వినిపిస్తుంది.విజయ్ కూడా ఎక్కువుగా తమిళంలోనే ఫోకస్ అయ్యేలా అక్కడ మీడియాతో ఇంటర్వ్యూ లు ఇస్తూ తనను తాను ప్రమోట్ చేసుకుంటున్నాడు. చెన్నై – హైద్రాబాద్ మధ్య తిరుగుతూ బిజీగా మారిపోయాడు. ఇక తెలుగులో కూడా ఈ సినిమా విషయంలో అయన ఒక్కని పేరే వినిపిస్తుంది. తెలుగులో కూడా ప్రమోషన్ ని తన బుజాలపైనే వేసుకున్నాడు. ఈ రోజు విజయవాడ లో మీటింగ్ అంటూ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. దాంతో పాటు హైదరాబాద్ లో కూడా ఈ మీటింగ్ ఉంటుందంట. ఈ సినిమాలో హీరోయిన్ మెహ్రిన్ ఉన్నా కూడా ఆమె పోస్టర్ కానీ పేరు కానీ పెద్దగా బయటికి రాలేదు. ఈ సినిమాలో మెహ్రిన్ కేవలం ఉందంటే ఉందన్న తరహాలోనే కనిపించి వెళ్ళిపోతుందట, పైగా పాటలు కూడా లేవట !! అందుకే ఆమె ఈ సినిమా విషయంలో ఎలాంటి ప్రమోషన్ చేయడం లేదు. ఇందులో విజయ్ ముఖ్యమంత్రి గా కనిపిస్తాడని .. అదికూడా కేవలం పదినిమిషాలు ఉంటుందట .. నాజర్, సత్యరాజ్, విజయ్ ల మధ్య మైండ్ గేమ్ గా ఈ సినిమా సాగుతుందట. మరి ఎలాంటి ఎంటర్ టైనెంట్ లేకుండా ఈ సినిమా సాగితే తెలుగు ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.