వరంగల్ అమ్మాయి నచ్చిందంటున్న అర్జున్ రెడ్డి హీరో ?

Saturday, January 13th, 2018, 12:32:05 PM IST

అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్కసారిగా పాపులర్ హీరోగా మారాడు విజయ్ దేవరకొండ. ఈ సినిమా తరువాత అయన ఏకంగా నాలుగు సినిమాలతో బిజీగా ఉన్నాడు. దాంతో పాటు ఈ మధ్య షాప్ ఓపెనింగ్స్ లకు కూడా గెస్ట్ గా వెళుతున్న విజయ్ ఈ మధ్య హన్మకొండ లో ఓ షాప్ ఓపెనింగ్ కు వెళ్ళాడు .. అక్కడ అమ్మాయిలు బాగా నచ్చారట .. ? ఈ సందర్బంగా విజయ్ వరంగల్ అమ్మాయిలు బాగా నచ్చారు .. నేను ఇక్కడి అమ్మాయినే పెళ్లి చేసుకుంటా అని చెప్పగానే అక్కడ ఒక్కసారిగా హంగామా మొదలైంది. మరి విజయ్ ని అంతగా ఆకట్టుకున్న అమ్మాయి ఎవరా ? అన్న ఆసక్తి ఎక్కువైంది. ఈ వేడుకలో అమ్మాయిలు విజయ్ చుట్టూ చేరి .. సెల్ఫీలు .. ఫోటోలు అంటూ నానా హంగామా చేసారు.