వై ఎస్ జగన్ పాత్రలో విజయ్ దేవరకొండ ?

Friday, September 14th, 2018, 03:04:17 PM IST

వై ఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథతో తెరకెక్కుతున్న యాత్ర సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. వై ఎస్ పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మమ్మూట్టి హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో వై ఎస్ జగన్ పాత్రలో ఎవరు నటిస్తారన్న విషయం ఇప్పటికి ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఈ సినిమాలో తమిళ స్టార్ హీరోలు సూర్య, లేదా కార్తీ నటిస్తారంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే .. అయితే ఈ పాత్ర కోసం టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తాడంటూ వార్తలు వస్తున్నాయి.

ప్రస్తుతం విజయ్ దేవరకొండ కు టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్న నేపథ్యంలో అయన క్రేజ్ ఈ సినిమాకోసం వాడుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. విజయ్ అయితే జగన్ పాత్రకు బాగా సూట్ అవుతాడని దర్శక నిర్మాతలు భావిస్తున్నారట. ప్రస్తుతం జగన్ పాత్రకోసం విజయ్ ని ఒప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయట. మహి వి రాఘవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా డిసెంబర్ 21న విడుదల చేయనున్నారు. మరి ఈ పాత్ర కోసం విజయ్ ఓకే అంటాడా లేదా అన్నది తెలియాల్సి ఉంది.

  •  
  •  
  •  
  •  

Comments