విజయ్ దేవరకొండ అదరగొట్టేశాడుగా!

Thursday, July 26th, 2018, 03:16:39 PM IST

విజయ్ దేవరకొండ పాట పాడితే ఎలా ఉంటుందా అని ఎదురుచూసిన ప్రేక్షకులకు ఒక్కసారిగా విజయ్ మంచి కిక్కు ఇచ్చాడనే చెప్పాలి. “అమెరికా గాళ్ అయినా . . అత్తిలి గాళ్ అయినా .. యూరప్ గాళ్ అయినా .. యానాం గాళ్ అయినా” అంటూ తన స్టైల్ లో అమ్మాయిల గురించి స్పెషల్ గా పాడుతూ అబ్బాయిలకు మద్దతు ఇచ్చాడు అర్జున్ రెడ్డి. అలాగే తన స్టైల్ ను కూడా బాగానే యాడ్ చేశాడు. అమ్మాయంటేనే టఫు.. వాళ్ల తిక్కకి మనమే స్టఫ్ఫు .. దానికి నేనే ప్రూఫు ..’ అంటూ అమ్మాయిల ధోరణి గురించి వివరించాడు. శ్రీమణి అందించిన లీరిక్స్ గోపి సుందర్ కంపోజింగ్ అదిరిపోయిందనే చెప్పాలి. విజయ్ దేవరకొండ ఎనర్జీకి ఫ్యాన్స్ చాలా వరకు పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను బన్నీ వాసు నిర్మిస్తున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments