తమిళ్ లో విజయ్ దేవరకొండ న్యూ రికార్డ్!

Saturday, September 1st, 2018, 05:25:12 PM IST

టాలీవుడ్ లో ఏడాది అత్యధిక లాభాలను అందించిన సినిమాల్లో గీత గోవిందం ఒకటి. సినిమాలో మంచి ఎంటర్టైన్మెంట్ ఉండడంతో ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా సినిమాను ఇష్టపడ్డారు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ఈ సినిమా ఇప్పటికి కూడా కలెక్షన్స్ ను బాగానే రాబడుతోంది. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా విజయ్ దేవరకొండ – రష్మిక మందాన జంటగా నటించిన సంగతి తెలిసిందే. ఇక అసలు విషయంలోకి వస్తే ఈ సినిమా తమిళ ఆడియెన్స్ కి కూడా బాగా నచ్చేసింది.

తెలుగు సినిమాలకు అప్పుడపుడు తమిళ్ ఆడియెన్స్ కూడా ఫిదా అవుతుంటారు. ఈ సారి గీత గోవిందం కూడా అక్కడి యువతకు బాగా నచ్చింది. తెలుగు వారితో పాటి తమిళ్ ప్రజలు కూడా సినిమా చూసేస్తున్నారు. పాజిటివ్ టాక్ రావడంతో కొన్ని చోట్ల హౌస్ ఫుల్ కలెక్షన్స్ కూడా రాబట్టిందట. రీసెంట్ గా అందిన సమాచారం ప్రకారం ఈ సినిమా దాదాపు అక్కడ 5 కోట్ల వసూళ్లను రాబట్టినట్లు తెలుస్తోంది. తమిళనాడులో ఓకే తెలుగు సినిమా ఈ స్థాయిలో రాబట్టడం విశేషమే అని అక్కడి సినీ పండితులు తెగ పొగిడేస్తున్నారు. మరి విజయ్ దేవరకొండ నెక్స్ట్ సినిమా నోటా తమిళ్ లో కూడా తెరకెక్కుతోంది. చూస్తుంటే మనోడు అక్కడ కూడా ఒక మార్కెట్ సెట్ చేసుకునేలా ఉన్నాడని చెప్పవచ్చు.

  •  
  •  
  •  
  •  

Comments