వీడియో : విజయ్ – టాక్సీ వాలా ప్లాన్ అదిరింది!

Tuesday, May 1st, 2018, 12:13:14 PM IST

అర్జున్ రెడ్డి సినిమాతో కెరీర్ లో గుర్తుండి పోయే హిట్ అందుకున్న విజయ్ దేవరకొండ నెక్స్ట్ సినిమాతో కూడా అదే తరహాలో మంచి విజయాన్ని అందుకోవాలని చూస్తున్నాడు. డిఫెరెంట్ జానర్ లో వస్తోన్న టాక్సీ వాలా సినిమాపై ప్రస్తుతం అంచనాలు పెరిగాయి. ఇక చిత్ర యూనిట్ ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసింది. అయితే అందులో భాగంగా ది డ్రీమ్ బీహైండ్ పేరుతో చిత్ర యూనిట్ ఒక షార్ట్ ఫిల్మ్ ని రిలీజ్ చేసింది.

అందులో నలుగురు పిల్లలు విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి సినిమాకు యు సర్టిఫికెట్ రావడం వల్ల థియేటర్ లో మిస్ అయ్యామని అందుకు గాను నెక్స్ట్ సినిమాలు థియేటర్స్ లో చూడాలని చెబుతారు. అందుకోసం విజయ్ ని మార్చేయడం ఆ తరువాత సరికొత్త లుక్ లో విజయ్ దర్శనమివ్వడం షార్ట్ ఫిల్మ్ లో హైలెట్ గా నిలిచింది. ఇక ఫైనల్ గా ఈ షార్ట్ ఫిల్మ్ తో టాక్సీ వాలా అన్ని ఏజ్ గ్రూప్ వాళ్లు థియేటర్స్ లో చూడవచ్చని సందేశాన్ని ఇచ్చారు. సమ్మర్ హాలిడేస్ కావడంతో పిల్లలను కూడా ఆకర్షించాలని చేసిన ఈ ప్రయత్నం ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments