కీర్తి సురేష్ పై స్టార్ హీరో అభిమానుల ఆగ్రహం!

Wednesday, June 13th, 2018, 03:41:35 PM IST

ఇటీవల మహానటి సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న కీర్తి సురేష్ నటిగా కూడా ఫుల్ మార్క్స్ అందుకుంది. ఆమె నటనకు అగ్ర నటీనటులే ఫిదా అయిపోయారు. సౌత్ అభిమానులు మొత్తం కీర్తికి అభిమానులు అయ్యారు. ఆ సంగతి పక్కనపెడితే.. అమ్మడికి ఇప్పుడు సోషల్ మీడియాలో ఊహించని విధంగా విమర్శలు ఎదుర్కొంటోంది. తమిళ్ స్టార్ హీరో విజయ్ అభిమానులు కీర్తి వెంటనే క్షమాపణలు చెప్పాలనే రేంజ్ లో కామెంట్ చేస్తుండడం సౌత్ లో హాట్ టాపిక్ అయ్యింది.

అసలు ఏం జరిగిందంటే.. ప్రస్తుతం ఈ జోడి మురగదాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమాకు సంబందించిన కొన్ని ఫోటోలు ఇటీవల సోషల్ మీడియాలో రిలీజ్ అయ్యాయి. ఒక ఫొటోలో విజయ్ కింద కూర్చొని ఉండగా కీర్తి సురేష్ సోఫా పై కూర్చుంది. అంతే కాకుండా విజయ్ కాలుపై ఆమె కాలు పెట్టడం అభిమానులకు నచ్చలేదు. కీర్తి పై పలు కామెంట్స్ తో ఆగ్రహం వ్యక్తం చేస్తుండడం వైరల్ అయ్యింది. ఇక మరోవైపు కీర్తి అభిమానులు మాత్రం ఆమెకు మద్దతుగా నిలుస్తూ ఆ చిన్న విషయానికి సీరియస్ అవ్వాల్సిన అవసరం లేదని కామెంట్ చేస్తున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments