తన పుట్టినరోజుకి ఐస్ క్రీం గిఫ్ట్ ఇచ్చిన విజయ్ దేవరకొండ!

Wednesday, May 9th, 2018, 05:05:41 PM IST

సాధారణంగా సినిమా హీరోలు తమ పుట్టినరోజుకు అభిమానులతో రక్తదానం చేయించడం, పేదలకు అన్నదానం, లేదా థియేటర్ కు వెళ్లి అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేసి పార్టీ చేయడం వంటివి చేస్తుంటారు. అయితే హీరోలందు కొందరు హీరోలు వేరయా అన్నట్లుగా వ్యవహరించాడు మన అర్జున్ రెడ్డి, అదేనండి విజయ్ దేవరకొండ. నేడు అనగా మే9 ఆయన పుట్టినరోజు కావడంతో ట్విట్టర్ లో క పోస్ట్ చేసి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తాడు. తాను ఇటీవల ఎర్రటి ఎండల్లో షూటింగ్ చేసానని, లా ఎండలో షూటింగ్ చేయడం కష్టమని, అందువల్ల ఎండతాపం నుండి కొంత ఉపశమనం పొందేందుకు ఆయన ప్రజలకు తన పుట్టినరోజు కానుకగా మూడు ఐస్ క్రీం బండ్లను ఏర్పాటు చేశారు.

అవి రోజు మొత్తం హైదరాబాద్ లో తిరుగుతాయని, ప్రతిఒక్కరు వచ్చి ఆనందంగా ఫ్రీగా ఐస్ క్రీం తినవచ్చని ఆయన అన్నారు. ” ఏ మాత్రం మొహమాట పడకుండా ఐస్ క్రీం బండి వద్దకు వచ్చి ఉచితంగా ఐస్ క్రీం తీసుకోండి. ఇది నా పుట్టినరోజు పార్టీ అనుకోండి. అయితే తిన్న తర్వాత మీ స్మైల్ పేస్ లను నాకు ఫోటో తీసి పంపితే నేను మరింత ఆనందిస్తా” అని ఆయన తన సోషల్ మీడియా మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. కాగా నేడు ఆయన నటించిన మహానటి విడుదలయి ప్రేక్షకుల నుండి పాజిటివ్ టాక్ సంపాదించింది. ఇంకెందుకు ఆలస్యం మీకు కూడా ఎక్కడైనావిజయ దేవరకొండ బర్త్ డే ఐస్క్రీమ్ బండి కనపడితే హాయిగా ఒక ఐస్ క్రీం లాగించేయండి మరి….