విజయ్ .. నిజంగా రియల్ హీరోనే ?

Wednesday, June 6th, 2018, 08:57:00 PM IST

గోరంత సాయం చేసి కొండంత ప్రచారం పొందాలనుకునే వారున్న ఈ రోజుల్లో ఓ స్టార్ హీరో అయి ఉండి ఎలాంటి సమాచారం లేకుండా గుట్టుచప్పుడు కాకుండా బాధితులకు సహాయం చేసి వారి మనసులను దోచుకుని .. అయన రీల్ హీరోగానే కాదు రియల్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ వివరాల్లోకి వెళితే తమ ఆరోగ్యాలను, పర్యావరణాన్ని దెబ్బతీస్తుందంటూ ఇటీవలే తమిళనాడు లోని తూత్తుకుడి ప్రజలు పెద్ద ఎత్తున పోరాటం జరిపిన విషయం తెలిసిందే. ఈ పోరాటంలో ప్రజలపై పోలీసులు అమునుషంగా కాల్పులు జరపడంతో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. దేశ వ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేసిన ఈ సంఘటనతో పలువురు ప్రముఖులు చనిపోయిన కుటుంబాలను పరామర్శించేందుకు వచ్చారు. అయితే వారంతా బాధితుల చేతిలో ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్నారు. చివరకు సూపర్ స్టార్ రజని కాంత్ కూడా వారి నుండిచేదు అనుభవాన్ని ఎదుర్కోవడం విశేషం. ఈ నేపథ్యంలో తమిళ స్టార్ హీరో విజయ్ నిన్న రాత్రి ఒంటరిగా బైక్ పై వచ్చి బాధితుల కుటుంబాలని పరామర్శించి .. ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయల పారితోషికం అందించారు. ఒక స్టార్ హీరో అయి ఉండి ఎలాంటి హంగులు ఆర్భాటాలు లేకుండా ఇలా బాధితులను పరామర్శించడం విశేషం.

  •  
  •  
  •  
  •  

Comments