పైరసీ కష్టాల్లో ..విజయ్ సినిమా ?

Monday, October 23rd, 2017, 10:30:49 AM IST

తమిళ సూపర్ స్టార్ హీరో విజయ్ నటించిన మెర్సల్ సినిమా దీపావళి కానుకగా విడుదలై సంచలనం రేపుతోంది. ఇప్పటికే మూడు రోజుల్లో వంద కోట్లు వసూలు చేసిన ఈ సినిమాకు పైరసీ భూతం పట్టుకుంది. అసలు పైరసీ భూతం ఏ రేంజ్ లో ఉందన్నది ఈ సినిమా విషయంలో తెలుస్తోంది. ఏకంగా సినిమా మొత్తాన్ని పైరసి చేసేయడమే కాకుండా .. ఏకంగా వెబ్ సైట్స్ లో పెట్టేశారు . ఈ విషయం పై నిర్మాతలు కోర్టును ఆశ్రయించారు. దాంతో కోర్టు ఏకంగా 2500 కు పైగా వెబ్ సైట్స్ పై చర్యలు తీసుకునేందుకు రెడీ అయింది. దాంతో పాటు హీరో విజయ్ పిలుపు మేరకు విజయ్ అభిమానులు పైరసీ లింక్ లను తొలగించడం ప్రారంభించారు. ఒక హిట్ సినిమా విషయంలో పైరసీ ఈ స్థాయిలో నష్టం కలిగిస్తుందా అన్నది అందరిలో షాక్ కు గురిచేస్తుంది. హీరో విజయ్ కూడా అభిమానులకు పిలుపునిచ్చాడు .. మెర్సల్ సినిమాను థియేటర్స్ లో మాత్రమే చుడండి అని. మరి మెర్సల్ విషయంలో పైరసీ ఇంకెలాంటి దారుణాలు చేస్తుందో చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments