ఇంటికెళ్లి మరీ సీఎం కు థాంక్స్ చెప్పిన స్టార్ హీరో..!

Sunday, October 15th, 2017, 10:42:54 PM IST

తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన మెర్సల్ చిత్రం భారీ అంచనాలతో ఈ నెల 18 న విడుదలవుతోంది. విడుదలకు ముందు ఈ చిత్రానికి అన్ని శుభశకునాలే ఎదురవుతున్నాయి. ఇటీవల టైటిల్ విషయంలో నెలకొన్న వివాదం కోర్టు వరకు వెళ్ళింది. చెన్నై హైకోర్టు విజయ్ కు అనుకూలంగా తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. తాజగా ఈ చిత్రానికి మరో ఫేవర్ కూడా జరిగింది. తమిళనాడు ప్రభుత్వం 10 శాతం గా ఉన్న వినోదపు పన్నుని 8 శాతానికి తగ్గించింది. దీనితో మెర్సల్ చిత్రానికి లాభం చేకూరనుంది.

తమిళ్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ మరియు సినీ సంఘాల వినతి మేరకు సీఎం పళనిస్వామి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. స్థానిక వినోదపు పన్నుని తగ్గించుకుంటే ఈ కొత్త చిత్రాలని విడుదల చేయనీయమని వారు హెచ్చరించడంతో మెర్సల్ విడుదల సందిగ్ధంలో పడింది. కానీ ప్రభుత్వం తీపి కబురు అందించడంతో ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ వెనక్కి తగ్గింది. దీనితో మెర్సల్ చిత్ర విడుదలకు ఉన్న అడ్డంకులన్నీ తొలిగాయి. ఈ నేపథ్యం హీరో విజయ్ ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లి ధన్యవాదాలు తెలిపాడు.