ట్రెండీ టాక్‌: మెర్స‌ల్‌లో మెరుపులు మెరిపించిన విజ‌య్‌?

Thursday, October 19th, 2017, 02:00:57 AM IST

ఇల‌య‌ద‌ళ‌ప‌తి విజ‌య్ హీరోగా న‌టించిన `మెర్స‌ల్` నేడు ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజైన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా రాక కోసం విజ‌య్ అభిమానులు స‌హా ప్ర‌పంచ‌మంతా ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూశారు. ఎందుకంటే విజ‌య్ ఈ చిత్రంలో మూడు షేడ్స్ ఉన్న పాత్ర‌లో అభిన‌యించ‌నున్నాడ‌న్న ప్ర‌చారం ఉంది. అయితే ఆ మూడు రూపాలేంటి తెలుసుకోవాల‌న్న ఆసక్తి జ‌నాల్లో ఉంది.

నేడు మూవీ రిలీజ్ త‌ర్వాత మీడియా నుంచి చ‌క్క‌ని ప్ర‌శంస‌లు ద‌క్కాయి. విజ‌య్ మ‌రో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌ కొట్టాడంటూ అంతా పొగిడేశారు. విజ‌య్ మూడు విభిన్న‌మైన షేడ్స్ ఉన్న పాత్ర‌ల్లో అద్భుతంగా న‌టించాడ‌ని ప్ర‌శంసిస్తున్నారు. అస‌లు ఈ చిత్రంలో విజ‌య్ చేసిన ఆ మూడు పాత్ర‌లు ఏవో తెలియాలంటే థియేట‌ర్లోనే సినిమా చూడాల్సిందేనంటూ ప్ర‌చారం చేస్తున్నారు. డాక్ట‌ర్ గా.. మెజీషియ‌న్‌గా.. క్రిమిన‌ల్‌గా మూడు విభిన్న రూపాల్లో విజ‌య్ క‌నిపించాడన్న‌ది సినిమా వీక్షించిన జ‌నం చెబుతున్నారు. ఈ చిత్రం తెలుగులో `అదిరింది` పేరుతో రిలీజ్‌కి వ‌స్తున్న‌ సంగ‌తి తెలిసిందే. ఇక ఈ సినిమాకి ప్ర‌ముఖ ఆంగ్ల దిన‌ప‌త్రిక‌ల్లో మినిమం 3/5 రేటింగు ఇచ్చి, ర‌వితేజ అండ్ టీమ్‌కి శుభాకాంక్ష‌లు తెల‌ప‌డం విశేషం.