విజయ్ నోటా విడుదల వాయిదా పడిందా ?

Monday, September 17th, 2018, 06:54:49 PM IST

అంటే ఆవూననే అంటున్నాయి ఫిలిం వర్గాలు. లేటెస్ట్ గా గీత గోవిందం సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం నోటా. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఆనంద్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. విజయ్ సరసన మెహ్రిన్, సంచనా నటరాజన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను వచ్చే నెల 4న విడుదల చేయాలనీ ప్లాన్ చేసారు కానీ, అనుకోకుండా ఈ సినిమాను అదేనేలా 18న విడుదల చేస్తారట. దసరా సందర్బంగా ఈ సినిమాను విడుదల చేయాలనీ అనుకున్నారు కానీ వేరే పెద్ద సినిమాలు వస్తుండడంతో కావాలనే వాయిదా వేసారట. ఈ సినిమాతో కోలీవుడ్ లో కూడా మంచి ఇమేజ్ తెచ్చుకునే ప్రయత్నాల్లో ఉన్నాడు విజయ్.