స్టార్ హీరో పాలిటిక్స్ ప్లాన్స్ ఎండ్.. ఎందుకు తప్పుకున్నట్టు?

Monday, April 16th, 2018, 11:20:07 AM IST

తమిళనాడులో సూపర్ స్టార్ రాజినీకాంత్ తరువాత ఆ స్థాయిలో మార్కెట్ ఉన్న హీరో ఎవరో అందరికి తెలిసిందే. ఇళయదళపతి విజయ్ గత కొంత కాలంగా వరుస బాక్స్ ఆఫీస్ హిట్స్ తో దూసుకుపోతున్నాడు. మార్కెట్ ను పెంచుకున్నట్లే అభిమానుల సంఖ్యను కూడా బాగానే పెంచుకుంటున్నాడు. అయితే విజయ్ పాలిటిక్స్ లోకి వస్తున్నట్లు ఎన్నో రోజుల నుంచి రూమర్స్ వస్తున్నాయి. గత ఏడాది విజయ్ అభిమానులకు దగ్గరవ్వడానికి ప్రయత్నాలు చేశాడు.

విజయ్ తండ్రి చంద్రశేఖర్ కూడా మీ అభిమాన నటుడు తప్పకుండా మీ కోసం పాలిటిక్స్ లోకి వస్తున్నలు చెప్పారు. దీంతో ఒక్కసారిగా గత ఏడాది నేషనల్ మీడియాలో కూడా ఆ న్యూస్ హాట్ టాపిక్ అయ్యింది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అలాంటి వాతావరణం కనిపించడం లేదు. పైగా చంద్రశేఖర్ కూడా విజయ్ పాలిటిక్స్ ప్లాన్ ఏమి లేదని ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. దీంతో అందరు షాక్ అయ్యారు. అంత సడన్ గా విజయ్ ఎందుకు మనస్సు మార్చుకున్నాడని అనేక రకాల ఊహాగానాలు వచ్చాయి.

అయితే ఎవరి ఒత్తిడి వలన అలా చేయలేదని కేవలం సొంత నిర్ణయమే అని చంద్రశేఖర్ తెలిపారు. సన్నిహితుల సమాచారం ప్రకారం.. కోలీవుడ్ దిగ్గజాలు రజినీకాంత్ – కమల్ హాసన్ పొలిటికల్ ఎంట్రీ ఫైనల్ అవ్వడమే అని తెలుస్తోంది. ఇద్దరి స్టార్స్ మధ్య పొలిటికల్ వార్ జరుగుతుంటే వెళ్లడం ఎంతవరకు కరెక్ట్ అనే విషయాన్నీ అలోచించి వెనక్కి తగ్గినట్లు టాక్. కానీ అభిమానుల నుంచి మాత్రం విజయ్ కి కొన్ని సలహాలు అందాయి. సామజిక సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు దగ్గరవ్వడానికి ప్రయత్నం చేద్దామని చెప్పినప్పటికీ విజయ్ నుంచి ఎలాంటి సమాధానం రాలేదని తెలుస్తోంది. మరి భవిష్యత్తులో అయినా ఈ స్టార్ హీరో పాలిటిక్స్ వైపు అడుగులు వేస్తారో లేదో చూడాలి.