రజిని కొత్త సినిమాలో విజయ్ సేతుపతి?

Thursday, April 26th, 2018, 03:54:47 PM IST

సూపర్ స్టార్ రజినికాంత్ ప్రస్తుతం 2.0, అలానే కాలా చిత్రాలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆయన త్వరలో సన్ పిక్చర్స్ పతాకం పై పిజ్జా చిత్ర దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం లో తెరకెక్కబోయే సినిమాలో కూడా నటించనున్న విషయం విదితమే. కాగా నేడు ఈ చిత్రానికి సంబంధించి ఒక ఆసక్తికర న్యూస్ ని ఆ సంస్థ ప్రకటించింది. ఈ సినిమాలో విలక్షణ నటుడు విజయ్ సేతుపతి కూడా నటిస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. అయితే ఆయన్ను ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్రకు తీసుకుంటున్నట్లు వినికిడి.

ఇప్పటికే పలుచిత్రాల్లో తన విలక్షణ నటనతో అందరిని అలరించిన విజయ్ సేతుపతి మొదటి సారి సూపర్ స్టార్ రజిని తో కలిసి నటిస్తున్నాడు. కార్తీక్ సుబ్బా రాజ్ తొలి చిత్రం పిజ్జా లో హీరోగా విజయ్ నటించిన విషయం మన అందరికి తెలిసిందే. అదికాక ఆయన తీసిన జిగర్తాండ లో కూడా ఒక అతిథి పాత్ర చేసాడు విజయ్. కాగా అనిరుద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. కాగా నటించిన కాలా చిత్రం ఈనెలలోనే విడుదల కావలసింది. అయితే గత కొద్దికాలంగా తమిళనాడులో సమ్మె కారణంగా వాయిదా పడ్డ ఈ చిత్రం ఎట్టకేలకు జూన్ నెలలో విడుదలకు సిద్ధమవుతోంది….

  •  
  •  
  •  
  •  

Comments