సైరాలో తన పాత్ర అదే అంటున్న విజయ్ సేతుపతి ?

Tuesday, July 31st, 2018, 12:11:56 AM IST

మెగాస్టార్ చిరంజీవి హీరోగా అత్యంత భారీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం సైరా. దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా తాజగా హైద్రాబాద్ పరిసరాల్లో వేసిన భారీ సెట్స్ లో ఓ షెడ్యూల్ ని పూర్తీ చేసుకుంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి జీవిత కథతో తెరకెక్కుతున్న ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. దాంతో పాటు పలు భాషలకు చెందిన ప్రముఖ నటీనటులను ప్రధాన పాత్రలకు ఎంపిక చేయడం ఆసక్తిని రేకెత్తింస్తుంది. తాజాగా ఈ సినిమాలో తమిళ హీరో విజయ్ సేతుపతి కూడా ఈ షెడ్యూల్ లో పాల్గొన్నాడు. ఈ సినిమాలో అయన పాత్ర ఏమిటనే విషయం పై కోలీవుడ్ పెద్ద చర్చ జరుగుతుంది. ఈ సినిమాలో విజయ్ తమిళ పోరాట యోధుడిగా కనిపిస్తాడని, బ్రిటిష్ వారిపై పోరాటానికి ఉయ్యాలవాడ తెలుగు, తమిళ నాయకులను ఏకం చేస్తాడని తన పాత్ర అద్భుతంగా ఉంటుందని విజయ్ రివీల్ చేసాడట. మెగాస్టార్ సినిమాలో విజయ్ సేతుపతి పాత్రపై తమిళ సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొనడం .. దానికి తోడుగా విజయ్ తన పాత్రను రివీల్ చేయడం వైరల్ అయింది. తదుపరి షెడ్యూల్లో తనకు సంబందించిన సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయట. విజయ్ సేతుపతి తమిళంలో క్రేజీ హీరోగా మంచి ఇమేజ్ ఉంది. నయనతార , తమన్నా హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో అమితాబ్, జగపతి బాబు, సుదీప్, లాంటి మరెందరో ప్రముఖ నటీనటులు నటిస్తున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments