విజ‌య‌సాయిరెడ్డి: డ్రైఫ్రూట్స్‌కే బాబు 18 ల‌క్ష‌లు..!

Tuesday, June 4th, 2019, 05:08:07 PM IST

ఏపీ మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ఏపీ ప్ర‌జ‌ల సొమ్ముని ఇష్టారాజ్యంగా ఖ‌ర్చు చేశారా?. వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి సాక్ష్యాల‌తో బ‌య‌ట‌పెడుతూ సంచ‌ల‌నం సృష్టిస్తున్నారు. ట్విట్ట‌ర్‌లో ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారి సంచ‌ల‌నం సృష్టిస్తున్నాయి. రాష్ట్రాన్ని విడ‌గొట్టి క‌ట్టు బ‌ట్ట‌ల‌తో త‌రిమార‌ని ఏడ్చి పెడ‌బొబ్బ‌లు పెట్టిన‌ చంద్ర‌బాబు దుబారా ఖ‌ర్చులు చూడండి. ఉన్న‌త విద్యామండ‌లిలో కేవ‌లం న‌లుగురి డ్రైఫ్రూట్స్ ఖ‌ర్చు 18 ల‌క్షలంట‌. విజ‌న‌రీ అనుభ‌వ‌జ్ఞుడు, అభివృద్ధి ప‌ద‌గామి అని కుల‌మీడియా కీర్తించింది ఈయ‌న‌నేనా? అంటూ విరుచుకుప‌డ్డారు.

ఆఫీసుల అద్దె చెల్లింపుల్లో చంద్ర‌బాబు ప్ర‌భుత్వం వంద‌ల కోట్ల అవినీతికి పాల్పడింది. న‌క్క‌ల రోడ్డులోని పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆఫీసుకు ఐదు ల‌క్ష‌ల లోపే అద్దె చెల్లించేవారు. కానీ బాబు దాన్ని 30 ల‌క్ష‌ల అద్దె భ‌వ‌నంలోకి మార్చేశారు. ప్ర‌జ‌ల సొమ్మంటే అంత చుల‌క‌నా బాబు?. ఇలా చెప్పుకుంటూ పోతే బాబు లీల‌లు ఎంత చెప్పినా తీర‌వు అంటూ విజ‌య‌సాయిరెడ్డి సోష‌ల్ మీడియాలో పెట్టిన పోస్ట్ చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఐదేళ్ల ప‌ద‌వీకాలంలో చంద్ర‌బాబు నాయుడు ఎంత విచ్చ‌ల‌విడిగా ప్ర‌జా ధ‌నాన్ని ఇష్టానుసారంగా దుర్వినియోగం చేశారో అర్మ‌వుతోంది. ఇప్ప‌టికే 70 ఏళ్లు దాటిన బాబు ఇక అధికారంలోకి రావ‌డం క‌ల్లే అంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. బాబు అవినీతిపై జ‌గ‌న్ విచ‌రాణ చేప‌డితే టీడీపీ శ్రేణుల్లో అత్య‌ధికులు జైలు జీవితం అనుభ‌వించ‌క త‌ప్ప‌దని వైకాపా వ‌ర్గాలు చెబుతున్నాయి.