దాని పేరు మాత్రం నన్ను అడగొద్దు ప్లీజ్ – ఎంపీ విజయసాయి రెడ్డి

Thursday, July 9th, 2020, 02:55:33 PM IST

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ప్రతిపక్షంలో ఉంటూ టీడీపీ నేతలు వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు కురిపిస్తూ, నారా లోకేశ్‌పై కూడా సెటైర్లు కురిపించారు. ఇళ్ల స్థలాల పంపిణీని అడ్డుకుని పేదలపై పగ సాధించడమే కాకుండా దొంగే దొంగ,దొంగ అని అరిచినట్టు నిరసన దీక్షలు చేస్తారట ట్డ్ఫ్(తెలుగు దొంగల పార్టీ)నేతలు అంటూ పట్టాల పంపిణీ వాయిదా వేయకుండా తక్షణమే అందజేయాలని డిమాండు. అడ్డుకునేది మీరే, ఇవ్వాలని అడిగేది మీరే. మరీ ఇంత సిగ్గు విడిచి రాజకీయం చేయాలా అని అన్నారు.

అంతేకాదు నిర్మాణం పూర్తి కాని ఇళ్లను పంపిణీ చేయట్లేదని పచ్చ పార్టీ ఆందోళనకు దిగడంపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు గారు కడిగి పారేశారని బాబు ఎక్కడ హర్ట్ అవుతాడో అని కన్నా సైలెంటయ్యాడు అని 30 లక్షల పట్టాలు సిద్ధమైనప్పటి నుంచి ‘విజనరీ’ చీకటి మిత్రులకూ టెన్షన్ పట్టుకుందని అన్నారు. అయిదేళ్ళుగా ఐదు లక్షల కోట్లు అయ్యతో కలిసి తిన్న గిత్త 5 నెలలుగా నోరు కట్టుకుని 5 కేజీలు తగ్గిందట అంటూ దాని పేరు మాత్రం నన్ను అడగొద్దు ప్లీజ్.. అంటూ ఇన్‌డైరెక్ట్‌గా లోకేశ్‌పై సెటైర్లు వేశాడు.