చంద్రబాబు ఈసారి బ్రాందీ సీసాల హారం వేసుకుంటాడు–విజయసాయిరెడ్డి!

Monday, November 18th, 2019, 03:40:50 PM IST

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ని చూసి ప్రస్తుతం వైసీపీ నేతలు భయపడుతున్నారని చెప్పాలి. టీడీపీ వలన కాకపోయినా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంధిస్తున్న ప్రశ్నలకు వైసీపీ ప్రభుత్వం భయపడుతోందని చెప్పాలి. అయితే చంద్రబాబు ఇసుక కొరత పై చేపట్టిన నిరసన దీక్షకు ఒక పక్క పవన్ మద్దతు తెలపడం తో వైసీపీ నేతలు కొంచెం అలెర్ట్ అయ్యారని చెప్పాలి. అయితే ఈ సందర్భం లో చంద్రబాబు చేసిన ఒక పని వైసీపీ నేతలు పదేపదే ట్రోల్ చేస్తున్నారు.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇసుక పొట్లాలను మేడలో వేసుకొని ఇసుక కొరత పై నిరసన తెలిపారు. అయితే బెల్టు షాపులు కొనసాగించాలని, లేదంటే మద్యనిషేధం వద్దని చేస్తాడేమో, అయితే ఇసుక కొరత ఫై నిరసన చేపట్టినప్పుడు ఇసుక పొట్లాలు వేసుకున్నట్లు, ఈసారి బ్రాందీ సీసాల హారం వేసుకుంటాడు అని వైసీపీ నేత, ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. కాస్త డ్రమాటిక్ లుక్ ఉంటేనే మీడియా కవరేజ్ కలర్ఫుల్ గా ఉంటుందని అనుకుంటున్నాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు.