“కియా మోటర్స్” తరలింపుపై విజయసాయి రెడ్డి సంచలన ట్వీట్!

Thursday, February 6th, 2020, 12:06:29 PM IST

తాజాగా ఏపీ రాజకీయ వర్గాల్లో కియా మోటర్స్ తరలింపు వార్త ఒక్కసారిగా సంచలనం రేపింది.ప్రపంచంలోనే అత్యున్నత న్యూస్ ఏజెన్సీ సంస్థ అయినటువంటి “రాయిటర్స్” వారు ఈరోజు ప్రతిపాదించిన వార్త సోషల్ మీడియాలో యిట్టె వైరల్ అయ్యిపోయింది.దీనితో ఒక్కసారిగా జగన్ ప్రభుత్వంపై విమర్శలు మరింత వెల్లువెత్తాయి.దీనితో సంచలనం రేపుతున్న ఈ వార్తలపై ముగింపుగా రాష్ట్ర ప్రభుత్వం తరపున వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి స్పందిస్తూ సంచలన ట్వీట్ పెట్టి వైరల్ అవుతున్న ఈ వార్తలను ఖండించారు.

“ఏపీ నుంచి కియా మోటర్స్ సంస్థ తరలిపోతోంది అని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజమూ లేదని,మా ప్రభుత్వం మరియు గౌరవనీయులైన వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు తమకు మరియు కియా మోటర్స్ సంస్థ వారికి అద్భుతమైన సత్సంబంధాలు ఉన్నాయని తెలిపారు.దాని ద్వారా ఆంధ్ర రాష్ట్రాన్ని కియాతో కలిసి అభివృద్ధి చేస్తామని” ఈ ట్వీట్ ద్వారా తెలిపారు.అయితే ఒక పక్క ఎలాంటి సరైన సమాచారం లేకుండా అంత పెద్ద సంస్థ ఇలాంటి వార్తలను ప్రచారం చెయ్యదు కదా?అని మరో పక్క ఆ వార్తలు కాస్త అబద్దమని మరికొన్ని బడా సంస్థలు ఛేఫున్నాయి.మొత్తానికి మాత్రం ఇప్పుడు ఈ వార్త పెద్ద గందరగోళంగా తయారయ్యింది అని చెప్పాలి.