విజయసాయి రెడ్డి ట్వీట్: టీడీపీ ప్రభుత్వం చేసిన పనికి సిగ్గుపడాలి..!

Saturday, June 1st, 2019, 01:48:22 PM IST

ఏపీలో ఈ దఫా జరిగిన ఎన్నికలలో వైసీపీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే రెండు రోజుల క్రితమే ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ ప్రమాణస్వీకారం చేసారు. అయితే ఆ రోజే జగన్ ఇచ్చిన మాటకు కట్టుబడుతూ వృద్దాప్య, వితంతు పింఛన్లను పెంచుతూ జీవోనీ కూడా విడుదల చేశారు. వృద్ధాప్య,వితంతు,వికలాంగుల పింఛన్లను భారీగా పెంచిన రాష్ట్రంగా ఏపీ దేశంలోనే చరిత్ర సృష్టించిందని విజయసాయి రెడ్డి అన్నారు. అయితే గత ప్రభుత్వంలో కిడ్నీబాధితుల సమస్యను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్నావారంతా సిగ్గు పడాలని ఆయన ట్వీట్ చేశారు. అయితే నేను చూసాను.. నేను ఉన్నాను అంటూ ఇచ్చిన మాట కోసం కిడ్నీ భాదితులకు పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని సీఎం జగన్ అందిస్తున్నారని తెలిపారు.

అంతేకాదు దుబారా ఖర్చులను సీఎం జగన్ గారు కట్టడి చేశారు. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో కూడా ఇది స్పష్టంగా కనిపించిందంటూ ఇక నుంచి ప్రతి రూపాయి వ్యయానికి అకౌంటబులిటీ ఉంటుందని ఆయన తెలిపారు. హిమాలయా వాటర్ బాటిల్స్ కనిపించవిక. రాష్ట్రం అప్పుల్లో ఉందని తెలిసి కూడా గత ప్రభుత్వం విలాసాలు వదులుకోలేదని చివరకు ఇలా అప్పుల ఊబిలో రాష్ట్రాన్ని పడేసిన ఘనతను టీడీపీ సొంతం చేసుకున్నదని అన్నారు.