బిగ్ బ్రేకింగ్ : వైసీపీ సోషల్ మీడియా విభాగంపై విజయసాయి రెడ్డి సంచలన నిర్ణయం.!

Monday, August 12th, 2019, 11:55:54 AM IST

గడిచిన 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ గెలుపుకు ముఖ్యమైన కారణాల్లో మరో కీలక కారణం ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం కూడా అనే చెప్పాలి.ఒక పక్క పార్టీకు సంబంధించిన అంశాలను ప్రజల్లోకి తీసుకుకెళ్తూనే మరోపక్క జగన్ పైన మరియు వారి పార్టీపైన ప్రతిప్రచారం చేసేటటువంటి టీడీపీ సోషల్ మీడియా వార్తలను కూడా బలంగా తిప్పికొట్టేవారు.అయితే ఇలా చేసేటటువంటి కొంతమంది కీలకమైన వారిలో చాలా మందిపైనే అప్పుడు అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అధిష్టానం కేసులు పెట్టింది.

దీనికి సంబంధించి కొత్తగా ఏర్పడినటువంటి వైసీపీ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది అని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ విజయసాయి రెడ్డి ఇటీవలే జరిగిన సోషల్ మీడియా సమావేశంలో తెలిపినట్టు తెలుస్తుంది.గత ప్రభుత్వంలో తమ పార్టీ కోసం ఎవరైతే కష్టపడి వ్యతరేఖ పార్టీపై బలంగా ప్రచారం చేసి కేసుల పాలయ్యారో అలంటి వారి అందరి మీదను ఉన్న కేసులను మన ప్రభుత్వంలో ఎత్తివేస్తున్నామని సంచలన నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు.

అంతే కాకుండా సోషల్ మీడియా వాలంటీర్ల పైన ఎక్కడైనా సరే కేసు నమోదు అయ్యినట్టు తెలిస్తే పార్టీ కార్యాలయానికే స్వయంగా తెలియజేయండి అని వారి సమస్యలను తప్పక పరిష్కరిస్తామని తెలిపారు.అంతే కాకుండా సోషల్ మీడియా వాలంటీర్ల యొక్క పని తీరును పార్టీ విషయంలో జగన్ మరువలేనిది అని తెలిపారని కూడా అన్నారు.