చరిత్ర పుస్తకం లో చిరిగిన కాగితం చంద్రబాబు..!

Saturday, July 11th, 2020, 08:56:09 AM IST

గడిచిన 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎంత దారుణంగా ఓటమిని చూడాల్సి వచ్చిందో అందరికీ తెలిసిందే. మొత్తం 175 స్థానాల్లో కేవలం 23 స్థానాల్లో మాత్రమే గెలుపొంది ఇప్పుడు వారు కూడా ఉంటారో ఉండరో అన్న దయనీయ పరిస్థితుల్లోకి ఆ పార్టీ వచ్చి పడింది. ముఖ్యంగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు పరిస్థితి ఎటూ కాకుండా పోయింది.

పార్టీకు మళ్లీ పూర్వ వైభవం ఎలా తీసుకొని రావలో అని ఓ పక్క బలం కోల్పోతుండటం మరోపక్క ఆ పార్టీకు తీరని నష్టం కలిగిస్తున్నాయి. పైగా అధికార వైసీపీ పార్టీ నేతలు బాబును మరింత కుంగదీస్తున్నారు. తాజాగా ఆ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన విమర్శలు అలానే ఉన్నాయి.

చరిత్ర పుస్తకం లో చిరిగిపోయిన కాగితం చంద్రబాబు అని అతని పైనే అతనికి నమ్మకం లేదు ఇక మిగతా వాళ్ళకి ఎలా నమ్మకం కలిగిస్తాడాని విమర్శలు చేసారు. అంతే కాకుండా ఒకప్పుడు రాష్ట్రాన్నే పాలించిన ఈ పార్టీ ఇప్పుడు కేవలం నాలుగు గ్రామాలకు పరిమితం అయ్యిపోయింది అని సంచలన నిజాలు చెప్పారు.