ఆ పాత్ర కోసం.. విజయ శాంతిని దింపుతున్నాడా ?

Thursday, February 1st, 2018, 01:37:18 PM IST


ప్రస్తుతం టాలీవుడ్ లో ఆసక్తి కలిగించే న్యూస్ హల్చల్ చేస్తుంది. అదేమిటంటే ప్రస్తుతం తెలుగులో నందమూరి తారక రామారావు జీవిత కథతో ఓ సినిమా తెరకెక్కించే సన్నాహాలు జరుగుతున్న విషయం తెలిసిందే. బాలకృష్ణ ఎన్టీఆర్ గా నటిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్లో సెట్స్ పైకి రానుంది. తేజ దర్శకత్వంలో తెరకెక్కే ఈ చిత్రానికి సంబందించిన ఫస్ట్ లుక్ ని కూడా విడుదల చేసారు. అయితే ఈ సినిమాలోని ఇతర కీలక పాత్రలకోసం పలువురు ప్రముఖ నటులను దింపాలని ప్లాన్ చేస్తున్నాడు బాలకృష్ణ. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ కెరీర్ లో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్ర కాస్త ఎక్కువగానే ఉంది .. ఈ నేపథ్యంలో ఇందిరా గాంధీ పాత్ర ఎవరు చేస్తారా ? అన్న అన్వేషణ ఎక్కువైంది. అయితే ఈ పాత్ర కోసం పలువురు నటీమణుల పేర్లు పరిశీలిస్తున్నారని అందులో మాజీ గ్లామర్ హీరోయిన్ విజయ శాంతి పేరు కూడా ఉందట !! అప్పట్లో బాలకృష్ణ – విజయశాంతి ల కాంబినేషన్ అంటే ఎంత క్రేజ్ ఉండేదో అందరికి తెలిసిందే. ఈ మధ్య రాజకీయాల పరంగా కూడా ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయి. మరి చాల రోజుల తరువాత మళ్ళీ బాలయ్య సినిమాలో విజయ శాంతి నటించడం నిజంగా సంచలనం కలిగించే విషయమే. అటు విజయ శాంతి తో పాటు ఖుష్బూ , నదియా ల పేర్లు కూడా వినిపిస్తున్నాయి.