మంగళగిరిలో లోకేష్ కు జరిగిన అవమానం అంత త్వరగా మర్చిపోయాడా?

Tuesday, August 13th, 2019, 10:45:41 AM IST

ముఖ్యమంత్రి తనయుడు కాబట్టి అడ్డా దారుల్లో మంత్రి పదవులు చేపట్టడాన్ని మాజీ ముఖ్యమంత్రి తనయుడు అయినటువంటి నారా లోకేష్ పై ఇతర పార్టీల నేతలు పెద్ద ఎత్తునే విమర్శలు గుపిస్తుంటారు.అలాగే ఒక పక్క లోకేష్ కూడా తమ పార్టీ ఓటమి పాలైన తర్వాత గట్టిగానే వైసీపీను మరియు జగనా ను టార్గెట్ చేస్తున్నారు.ఇందుకు తగ్గట్టుగానే వైసీపీ నుంచి వీరిని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి గట్టిగా తగులుకుంటారు.

చంద్రబాబు మరియు లోకేష్ లు ఇద్దరికీ తనదైన శైలి రిప్లై ఎప్పుడు ఇస్తుంటారు.అయితే ఈసారి ఎన్నికల్లో మాత్రం లోకేష్ మంగళగిరి నియోజకవర్గం నుంచి మొట్టమొదటి సారిగా పోటీ చేసి ఘోరంగా ఓడిపోయిన సంగతి అందరికి తెలిసిందే.దీనిపై లోకేష్ దిమ్మతిరిగే ట్వీట్ ఒకటి విజయసాయి రెడ్డి పెట్టారు.”మూడు శాఖల మంత్రి, ముఖ్యమంత్రి తనయుడైనా మంగళగిరి ప్రజలు పొర్లించి కొడితే పత్తా లేకుండా పోయిన లోకేశ్ బాబు పెద్దబాల శిక్ష చదివి సుమతీ శతకాలు వల్లిస్తున్నాడు. మంగళగిరిలో 150 కోట్లకు పైగా వెదజల్లిన విషయం దేశమంతా తెలుసు. అంత అవమానాన్ని 3 నెల్లకే మర్చి పోతే ఎలా?” అంటూ లోకేష్ కు మంగళగిరిలో జరిగిన అవమానాన్ని గుర్తు చేసారు.