ఈ వయసులో నీకు ఎంతటి దౌర్భాగ్యం బాబూ – విజయసాయి రెడ్డి

Tuesday, June 8th, 2021, 03:00:46 AM IST

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. పంచాయతీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత బాబు గ్రాఫ్ పతనమైందని స్పష్టమైంది. కానీ ఇంత అవమానం ఎదురవుతుందని ఎవరూ ఊహించలేదు. జూ. ఎన్టీఆర్ రావాల్సిందే అని కుప్పంలో కటౌట్లు పెట్టి, జెండాలు ఎగరేశారట సొంత కార్యకర్తలు. ఈ వయసులో నీకు ఎంతటి దౌర్భాగ్యం బాబూ అంటూ ఎద్దేవా చేశారు.

ఇక అంతకు ముందు లోకేశ్ అనే పొట్టేలుని ఏపుగా మేపి రాష్ట్రం మీదకు వదిలాడు బాబు అని, కొమ్ముల దురదతో దారిన పోయే వారందరిని కుమ్మాలని చూస్తున్నాడు. చూసి చూసి ఎన్నడో కొమ్ములు వంచుతారు. ప్రజాదరణ కోల్పోయి పూనకం వచ్చిన వాడిలా శివాలూగితే వేపమండలతో బడిత పూజ చేస్తారు జనం. పోనీలే అని వదిలేయరని హెచ్చరించేలా విజయసాయి ట్వీట్ చేశారు.