టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వరుస ట్వీట్లతో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శలు గుప్పిస్తున్నారు. విశాఖ ఉక్కుకోసం మిస్డ్ కాల్ ఇవ్వాలంటూ జూమ్ బాబు బయలుదేరాడని, ఉద్యమం అంటే రియాల్టీ షోనో లేక అందాల పోటీలో అనుకున్నావా తుప్పు నాయుడు అని కుప్పంలో తగిలిన షాక్‌కి ఉన్న మతి పోయిందా అంటూ ప్రశ్నించారు.
ఇక అంతకు ముందు లీడర్లు ప్రజల పక్షాన నిలబడతారని, గెలిపించిన వారి కోసం త్యాగాలకు సిద్దపడతారు. పులివెందుల, కడప ప్రజలు 1978 నుంచి వైఎస్సార్ గారి కుటుంబానికి నీరాజనం పలకడానికి అదే కారణం. చంద్రగిరిని విడిచి కుప్పం పారిపోయిన బాబు, జనం కోసం నిజాయితీగా ఒక్క పనీ చేయలేదని అలాంటప్పుడు ఓడించక పూజిస్తారా అని ఎద్దేవా చేశారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం పాదయాత్ర చేస్తుంటే ఎవడిక్కావాలి పాదయాత్రలు.. ఇంటికెళ్లి పడుకో అంటూ వెటకారం చేశాడు. విశాఖ ఉక్కుపై చంద్రబాబు చిత్తశుద్ధి ఇదే. ఢిల్లీలోనైనా గల్లీలోనైనా తెగించి పోరాడేది మేమే. హైదరాబాద్ ఇంట్లో దాక్కుని జూమ్ కుట్రలు చేయడం తప్ప నువ్వు పీకేదేమీ లేదని అన్నారు.
విశాఖ ఉక్కుకోసం మిస్డ్ కాల్ ఇవ్వాలంటూ జూమ్ బాబు బయలుదేరాడు?ఉద్యమం అంటే రియాల్టీ షోనో లేక అందాల పోటీలో అనుకున్నావా తుప్పు నాయుడు? కుప్పంలో తగిలిన షాక్ కి ఉన్న మతి పోయిందా?
— Vijayasai Reddy V (@VSReddy_MP) February 19, 2021