కెలికి పరువు తీసుకోకు.. దేవినేని ఉమాకి విజయసాయి కౌంటర్..!

Friday, June 11th, 2021, 09:54:34 PM IST

టీడీపీ నేత దేవినేని ఉమా పోలవరం ప్రాజెక్ట్ అంశంపై మాట్లాడుతూ వైసీపీ సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేశారు. పోలవరం పనులను 71 శాతం టీడీపీ హయాంలోనే పూర్తి చేశామని, స్పిల్‌వే ద్వారా 2019 జూలైలో పోలవరం నుంచి నీళ్లను పంపించినట్లు, అదే నీటిని వైసీపీ ప్రభుత్వం మళ్లీ పంపించి మరోసారి ప్రారంభించటం సిగ్గుచేటని అన్నారు. అయితే నిర్వాసితులకు ఎకరాకు పది లక్షలు ఇస్తామని ఇవ్వలేదని, వారిని బెదిరించి బలవంతంగా ఖాళీ చేయిస్తున్నారని మండిపడ్డారు. అసలు రెండేళ్ల వైసీపీ పాలనలో పోలవరం ప్రాజెక్ట్‌ కోసం ఎంత ఖర్చు పెట్టారో ప్రజలకు సమాధానం చెప్పాలని ఉమ డిమాండ్ చేశారు.

దీనిపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మాట్లాడుతూ ఉమకు కౌంటర్ ఇచ్చారు. హవ్వ, పోలవరం గురించి నువ్వు మాట్లాడటం ఏమిటి ఉమాశ్రీ అంటూ 2018లో మీరు కట్టినట్లు చెప్పుకుంటున్న రిజర్వాయర్ ఎక్కడుందో ఎవరికీ కనిపించడం లేదు. మహానేత వైఎస్సార్ అన్ని అనుమతులు తెచ్చి పనులు మొదలు పెట్టిన పోలవరాన్ని జగన్ గారు తుదిదశకు తీసుకొచ్చారు. కెలికి పరువు తీసుకోకని సూచించారు.