గుండె దిటవు చేసుకో.. చంద్రబాబుకు విజయసాయి రెడ్డి సజేషన్..!

Thursday, February 25th, 2021, 02:16:12 AM IST


టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఓ సజేషన్ ఇచ్చారు. గుండె దిటవు చేసుకో చంద్రబాబూ అంటూ జరగబోయే స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికల ఫలితాలు కూడా నువ్వు మూర్ఛపోయే విధంగానే ఉంటాయని అన్నారు. డబ్బు, మద్యంతో శాసించే జమానా లేదిప్పుడు, ఈ వయసులో జగన్నాథ రథచక్రాలకు అడ్డంగా వెళ్లే సాహసం చేయొద్దు అని అన్నాడు. ఇక అంతకు ముందు వైజాగ్ స్టీల్ పై ప్రధానికి రాసిన లేఖతో, తను గోబెల్స్ ప్రచారాలకు పాల్పడ్డట్టు చంద్రబాబు అంగీకరించాడని అన్నారు.

అంతేకాదు జగన్ గారి ప్రభుత్వం ప్లాంటును ప్రైవేటు సంస్థలకు అమ్మాలని చూస్తోందని మొన్నటి దాకా దుష్ప్రచారం చేసాడని, కేంద్ర బడ్జెట్ లో ప్రైవేటీకరణను ప్రతిపాదించారని లేఖలో ప్రస్తావించాడని అన్నారు. ఇదిలా ఉంటే 41 శాతం సర్పంచ్ పదవులు గెలిచామంటూ చంద్రబాబు జబ్బలు చరుస్తున్నాడని, హిందూపురం, అమరావతి, కుప్పంలోనే డిపాజిట్లు రాలేదు,
మీ సిట్టింగ్ ఎమ్మెల్యేలున్నచోట సింగిల్ డిజిట్ దాటలేదు. మీ కాకిలెక్కల్ని జనం నమ్ముతారా? దమ్ముంటే గెలిచారంటున్న పంచాయతీల్ని యెల్లో పేపర్లలోనైనా ప్రకటించండని ఎద్దేవా చేశారు.