టీడీపీ నుంచి బీజేపీ ఎలా బయటపడుతుందో.. విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు..!

Monday, July 6th, 2020, 07:29:08 AM IST

ఏపీ ప్రతిపక్ష పార్టీ టీడీపీపై, ఆ పార్టీ నేతలపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏడాది కాలంగా తినడానికి ఏమీ దొరక్క నక నక లాడుతున్న టీడీపీ మిడతల దండు కమలం పువ్వు వైపు కదులుతోందని ఎద్దేవా చేశారు.

అంతేకాదు ఇప్పటికే కొన్ని మిడతలు ఆపార్టీలో చేరి విధ్వంసం సృష్టిస్తున్న విషయం గ్రహించేలోగానే మిగతావి కూడా ఎగురుకుంటూ బయల్దేరాయని, ఈ విపత్తు నుంచి బీజేపీ ఎలా బయటపడుతుందో చూడాలని కామెంట్స్ చేశారు.