చంద్రబాబు కి దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చిన విజయసాయిరెడ్డి

Sunday, November 17th, 2019, 10:11:08 AM IST

తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు 2019 ఎన్నికల్లో 23 సీట్లు మాత్రమే సాధించి ప్రతిపక్ష హోదాలో వున్నారు. అయితే టీడీపీ కి అధికారం చేజారాక వైసీపీ నేతలు ఒక్కొక్కరిగా విమర్శలు గుప్పిస్తున్నారు. చంద్రబాబు పాలనలో చేసిన అవినీతి అన్యాయం అంటూ సమయం దొరికినప్పుడల్లా టీడీపీ నేతల పై విమర్శలు చేస్తూనే వున్నారు. ఇటీవలే రాజకీయాల్లో చాల మార్పులే వచ్చాయి. టీడీపీ నేతలు పార్టీ ని వీడుతున్నారు. ఇతర పార్టీలకు మారుతున్నారు.

అయితే ఈ తరుణంలో చంద్రబాబు పై మరొకసారి దారుణ వ్యాఖ్యలు చేసారు వైసీపీ నేత, ఎంపీ విజయసాయిరెడ్డి. ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచి, ఎన్టీఆర్ విగ్రహానికి దండేశాడు. ప్రభుత్వం సాండ్ వెబ్సైటు ని హాక్ చేయించి కృత్రిమ ఇసుక కొరత సృష్టించి ఇసుక పై నిరసన దీక్ష చేస్తున్నాడు. ఆయనంతే, జనం ఛీ కొట్టినా మారదంతే అంటూ విజయసాయిరెడ్డి తనదైన శైలిలో సై రా పంచ్ వేశారు.