బ్రేకింగ్: విజనరీది మాట మీద నిలకడలేని బతుకు–విజయసాయి రెడ్డి

Sunday, January 26th, 2020, 11:01:12 AM IST

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫై విజయసాయి రెడ్డి ఘాటు విమర్శలు చేసారు. కౌన్సిల్ ని పునరుద్దరించాలని దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రతిపాదించినపుడు చంద్రబాబు డబ్బులు దండగ అన్నాడు. అయితే ఇపుడు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు కౌన్సిల్ వల్ల ఖర్చు తప్ప, ప్రయోజనం లేదు అనగానే, మీరు రద్దు చేస్తే నేనొచ్చాక మళ్ళీ మళ్ళీ తెస్తా అని బట్టలు చించుకుంటున్నాడు అని చంద్రబాబు ఫై విమర్శలు చేసారు. విజనరీది మాట మీద నిలకడలేని బతుకు అంటూ చంద్రబాబు నాయుడు ఫై సంచలన వ్యాఖ్యలు చేసారు.

విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలకు గాను నెటిజన్లు స్పందిస్తున్నారు. విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యల ఫై విమర్శలు గుప్పిస్తున్నారు. అంతేకాకుండా దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి ఫై కామెంట్లు చేస్తున్నారు. అంటే అపుడు మీ మహామేత డబ్బులు మెక్కడానికే కౌన్సిల్ పెట్టాడా? అంటూ ప్రశ్నిస్తున్నారు. కొందరు చంద్రబాబు నాయుడు వద్ద నుండి సమగ్రత, విలువలు మరియు కమిట్మెంట్ ఆశించకండి విజయసాయిరెడ్డి గారు అని అంటున్నారు. ఇంకొకరు మీ కోర్ట్ ఖర్చు కంటే ఎక్కువా? అంటూ ప్రశ్నిస్తున్నారు.