బ్రేకింగ్ న్యూస్ : పవన్ అజ్ఞ్యానంపై విజయసాయి రెడ్డి సంచలన ట్వీట్స్.!

Wednesday, December 4th, 2019, 12:09:35 PM IST

గత కొన్ని రోజుల నుంచి ఏపీ రాజకీయాలు అంతా వైసీపీ వర్సెస్ జనసేన గా మారిపోయినట్టు కనిపిస్తున్నాయి.పవన్ వైసీపీ మరియు జగన్ పై చేస్తున్న వ్యాఖ్యలకు వైసీపీ నేతలు అంతా కిందా మీదా పడుతున్నారు.అంతేకాకుండా పవన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.అలా చేస్తున్న విమర్శల్లో వైసీపీ రాజ్యసభ అధ్యక్షుడు ఎంపీ విజయసాయి రెడ్డి అయితే మరింత దారుణమైన ట్వీట్స్ వేస్తున్నారు.గత కొన్ని రోజుల నుంచి పవన్ పై తీవ్ర స్థాయి ఆరోపణలు చేస్తున్న విజయసాయి రెడ్డి ఈ రెండు రోజుల నుంచి అయితే ఆ డోస్ మరింత పెంచారు.

“రేపిస్టులకు ఉరిశిక్ష ఎలా వేస్తారని ప్రశ్నిస్తున్నాడంటే మానసిక స్థితిలో ఏదో సీరియస్ ప్రాబ్లమ్ ఉన్నట్టే. దేశమంతా కఠినంగా శిక్షించాలని కళ్ల నీళ్లు పెంటుకుంటుంటే ఈయనకు రేపిస్టుల ప్రాణాలు ముఖ్యమై పోయాయి. పవనిజం అంటే ఇదేనేమో? రాజకీయ పార్టీ పెట్టింది ఇందుకేనా?”,”ఒకాయన 40 ఏళ్ల ఇండస్ట్రీ అంటాడు. ఇంకొకాయన అజ్ణానాంధకారాన్ని కవర్ చేసుకునేందుకు రాజ్యాంగాన్ని ఔపోసన పట్టానంటాడు. రాజకీయాల్లో కొనసాగాలంటే ఇంత నీచత్వానికి పాల్పడాలా అని ప్రజలు అసహ్యించుకునే స్థాయికి దిగజారి పోయారిద్దరూ.”

అని అంటూ చంద్రబాబు మరియు పవన్ లను కలిపి అలాగే “వానపడుతుంటే, ఎండ కాస్తుంటే గొడుగు పట్టుకుని బయటకు వెళ్తారు ఎవరైనా. దత్త పుత్రుడు ఈ రెండిటికీ భిన్నం. శీతాకాలంలో గొడుగుతో తిరుగుతాడు. గంట గంటకూ చిత్త భ్రమలకు లోనవుతుంటాడు. ఏ సమయంలో ఏ డైలాగ్ వదులుతాడో అంతుబట్టదు.బిజేపీలో విలీనానికి గ్రౌండ్ ప్రిపేరు చేసుకుంటున్నాడు.”అంటూ పవన్ పై తీవ్ర స్థాయి ఆరోపణలు చేసారు.మరి దీనిపై పవన్ మళ్ళీ ఏమన్నా కౌంటర్లు ఇస్తారేమో చూడాలి.