ఆంధ్రా ఇమేజ్ దెబ్బతీస్తున్నావ్.. ఏబీఎన్ రాధాకృష్ణపై విజయసాయి సీరియస్..!

Tuesday, June 30th, 2020, 01:35:36 AM IST


ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సీరీయస్ అయ్యారు. పోలీస్ కేసు నిందితులు అచ్చన్న,అయ్యన్న,జేసీకి నీ సపోర్ట్ జోక్యం ఏంటి, వీలర్ డీలర్ సుజనా, నిమ్మగడ్డ భేటీపై రచ్చ అని జగన్ గారిపై రాస్తావేంటి కిట్టు అంటూ సెటైర్లు వేశారు. 151 సీట్లు ప్రజా తీర్పు, ప్రశ్నించేందుకు నీవెవరు కిట్టు అంటూ, ఆఫ్లోనా టెర్రర్ వాతారవణం పచ్చకుల మీడియాలోనా అని ప్రశ్నించారు. అంత ఫ్రస్ట్రేషన్ అవసరమా కిట్టు అన్నారు.

అయితే ఆంధ్రజ్యోతి కిట్టప్ప కొత్త/చెత్త పలుకులో ఫ్రస్టేషన్. జగన్ గారు 30 లక్షల ఇళ్ల స్థలాలు పంపిణీ తప్పుపడతావ్, మళ్లీ కులం యాంగిల్ తీస్తున్నావ్, విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అసలు నివాసానికి పనికిరాదంటావ్, ఇప్పుడు ఆంధ్రా ఇమేజ్ దెబ్బతీసేలా రాస్తున్నావ్ అని మండిపడ్డారు.