నక్క జిత్తుల రాజకీయాల్లేవు.. గ్రాఫిక్స్ మాయలు లేవు – విజయసాయి రెడ్డి

Wednesday, June 9th, 2021, 10:25:05 PM IST

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా మరోసారి విమర్శలు గుప్పించారు. జగన్ గారు సీఎంగా ప్రమాణం చేసినప్పుడు హుందాగా అభినందించాల్సింది పోయి అనుభవం లేదన్నావని, ప్రజలు తప్పు చేశారని శోకాలు పెట్టావని అన్నారు. ఇప్పుడు జనం మధ్యకు వెళ్లి అప్పటి మాటలు అనగలవా బాబూ అని విజయసాయి ప్రశ్నించారు. నక్క జిత్తుల రాజకీయాల్లేవు. గ్రాఫిక్స్ మాయలు లేవని, ప్రచార ఆర్భాటాలకు పోకుండా పనులు జరుగుతున్నాయని అన్నారు.

ఇక అంతకు ముందు రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడుల అంశంపై కూడా విజయసాయి రెడ్డి ఓ సెటైరికల్ పంచ్ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ డ్ఫీఈట్ గణాంకాల ప్రకారం చంద్రబాబు ఐదేళ్ల పాలనలో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు 40వేల కోట్లు అని, జగన్ గారి రెండేళ్ల పాలనలో వచ్చిన పెట్టుబడులు 30వేల కోట్లు అని అన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా ఇతర రాష్ట్రాల కంటే మెరుగ్గా ఏపీకి పెట్టుబడులు వచ్చాయని చెప్పుకొచ్చారు. అయితే లక్షల కోట్లు పెట్టుబడులు వస్తున్నాయని కేవలం ప్రచారానికే 10వేల కోట్లు తగలేసి ఉంటామని లోకేశ్ అంటున్నట్టు విజయసాయి పోస్ట్ చేశారు.