మూడు నెలలకే టీడీపీ బట్టలు చించుకుంటే ఎలా – సైరా సెటైర్

Saturday, August 24th, 2019, 05:49:12 PM IST

ఏపీలో ఈ సారి జరిగిన ఎన్నికలలో వైసీపీ భారీ విజయాన్ని నమోదు చేసుకుని ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ పదవి బాధ్యతలు చేపట్టారు. అయితే ముఖ్యమంత్రిగా జగన్ తనదైన శైలిలో కీలక నిర్ణయాలు తీసుకుంటూ పాలనను పరుగులు పెట్టిస్తున్నారు. అంతేకాదు ఎన్నికల సమయంలో తాను ప్రజలకు ఇచ్చిన హామీలను ఒకదాని తరువాత ఒకటి నెరవేరుస్తూ అందరి చేత ప్రశంసలు పొందుతున్నాడు.

అయితే వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్ది ఎన్నికల ముందు నుంచి టీడీపీపై ఆరోపణలు చేస్తూ చంద్రబాబుకు పెద్ద సవాల్‌గా మారాడు. ఇక ఎన్నికలలో వైసీపీ విజయం సాధించడంతో టీడీపీ నేతలపై, చంద్రబాబుపై మరింత అరోపణలు మొదలుపెట్టాడు. అయితే తాజగా టీడీపీ నేతలను ఉద్దేశిస్తూ మూడు నెలలకే ఇంతగా బట్టలు చించుకుంటే ఐదేళ్లు ఎలా తట్టుకుంటారు బాబూగారు అంటూ? తిరుమల ఆర్టీసీ టిక్కెట్ల వెనుక మైనార్టీలను జెరూసలేం, మక్కాకు తీసుకెళ్లే చంద్రన్న పథకాలను ముద్రించింది మీ హయాంలోనే కదా. ఏం ఎరగనట్టు అన్యమత ప్రచారమంటూ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని అన్నారు. అంతేకాదు మిమ్మల్ని ఇక మెంటల్ హాస్పిటల్లో చేర్చాల్సిందే అంటూ ఎద్దేవా చేసారు.