విజయసాయి రెడ్డి : చంద్రబాబు నీ చౌకబారు మాటలు ఇకనైనా మానుకో

Monday, August 12th, 2019, 06:58:31 PM IST

ఏపీలో ఈ సారి జరిగిన ఎన్నికలలో వైసీపీ భారీ విజయాన్ని నమోదు చేసుకుని ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ పదవి బాధ్యతలు చేపట్టారు. అయితే ముఖ్యమంత్రిగా జగన్ తనదైన శైలిలో కీలక నిర్ణయాలు తీసుకుంటూ పాలనను పరుగులు పెట్టిస్తున్నారు. అంతేకాదు ఎన్నికల సమయంలో తాను ప్రజలకు ఇచ్చిన హామీలను ఒకదాని తరువాత ఒకటి నెరవేరుస్తూ అందరి చేత ప్రశంసలు పొందుతున్నాడు.

అయితే వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్ది ఎన్నికల ముందు నుంచి టీడీపీపై ఆరోపణలు చేస్తూ చంద్రబాబుకు పెద్ద సవాల్‌గా మారాడు. ఇక ఎన్నికలలో వైసీపీ విజయం సాధించడంతో టీడీపీ నేతలపై, చంద్రబాబుపై మరింత అరోపణలు మొదలుపెట్టాడు. అయితే తాజాగా మరోసారి చంద్రబాబుపై విమర్శలు గుప్పించాడు. ఓటు వేయక పోతే ఇళ్లు కూలుస్తారా అంటూ చౌకబారు మాటలు మీకే సాధ్యం చంద్రబాబు గారూ అంటూ మా ఎమ్మెల్యేలను గెలిపించని చోట రూపాయి ఇవ్వం అని సిగ్గులేకుండా చెప్పిన చరిత్ర మీది. పార్టీలకతీతంగా ప్రజలందరినీ ఒకేలా చూస్తామన్న జగన్ గారి హుందాతనం మీకెప్పటికీ రాదంటూ మండిపడ్దారు.

అంతేకాదు ఉమా గురుంచి మాట్లాడుతూ ఎంత దిగజారావు ఉమా? ఊహాకల్పనలకు కూడా ఒక హద్దుండాలి. సిమెంటు కంపెనీలు బస్తాకు 5 రూపాయలివ్వనిందుకే ఇసుక సరఫరాను ఆపేశామా? నీతో సహా ఇసుక బకాసురులు పదివేల మంది ఒక్కొక్కరు వంద కోట్లకు పైగా దోచుకున్నారు. అలాగే వదిలేయక కొత్త పాలసీ ఎందుకు తెస్తున్నారు అనే కదా నీ బాధ అంటూ ఎద్దేవా చేసారు. అంతేకాకుండా చంద్రబాబు మహారాజా వారి అమరావతి రాజ్యంలో కోడెల అనే సామంతుడి కుటుంబం సాగించిన అక్రమాలు నివ్వెరగొల్పేలా ఉన్నాయి. బైకులు విక్రయించి ఆర్టీయేకు జీవిత పన్ను చెల్లించకున్నా అధికారులేం చేశారో అంతుబట్టదు. పార్టీ నుంచి బహిష్కరించకుండా బాబు ఇంకా కాపాడే ప్రయత్నం చేస్తున్నారంటూ 40 ఏళ్ల అనుభవం రాష్ట్రాల మధ్య విద్వేషపు గోడలు నిర్మిస్తే సీఎం జగన్ గారు వాటిని ధ్వంసం చేసి స్నేహ వారధులు తెరిచారు. పదేళ్ల తర్వాత ఆగస్టులో కృష్ణా డ్యాములన్నీ నిండాయి. రిజర్వాయర్ల గేట్లు ఎత్తే కార్యక్రమాల్లో సీఎం గారి సూచన మేరకు ఇరు రాష్ట్రాల మంత్రులు పాల్గొనడం అరుదైన దృశ్యమని సంబోధించారు.